SRH Captain: పాట్ కమ్మిన్స్ కెప్టెన్సీకి ఎండ్ కార్డు.. ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్‌గా ఇషాన్ కిషనే!
SRH Captain: ఐపీఎల్ 2026లో ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్సీ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమ్మిన్స్ గాయం కారణంగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు.
SRH Captain: పాట్ కమ్మిన్స్ కెప్టెన్సీకి ఎండ్ కార్డు.. ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్‌గా ఇషాన్ కిషనే!
SRH Captain: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్టులో కెప్టెన్సీ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమ్మిన్స్ గాయం కారణంగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో టీమిండియా కీపర్ ఇషాన్ కిషన్ జట్టును నడిపించాడు. ఇషాన్ సారథ్యంలో 7 మ్యాచ్‌లు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్ నాలుగు గెలిచింది. ముఖ్యంగా ఉప్పల్ మైదానంలో హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళుతోంది. మొదట్లో కాస్త తడబడిన ఇషాన్.. అనంతరం కెప్టెన్‌గా సత్తాచాటాడు. ఇషాన్ కెప్టెన్సీకి మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు కమ్మిన్స్ తిరిగి జట్టులో చేరడంతో కెప్టెన్సీ ఎవరు చేపడతారన్నది చర్చనీయాంశమైంది.
ఫిట్‌నెస్ టెస్టులు పాసైన పాట్ కమిన్స్ ఇటీవలే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరాడు. ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌తో కమిన్స్ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ అంశం చర్చనీయాంశంగా కాగా.. మాజీ భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కమ్మిన్స్ తిరిగి వచ్చినా.. కిషన్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. 'ఇది డిబేటబుల్ అంశం. ఒక యువ కెప్టెన్‌ను జట్టు నమ్మితే అతనితోనే ముందుకు వెళ్లాలి. ఇషాన్ కిషన్ నాయకత్వంలో జట్టు మంచి ఫలితాలు సాధిస్తోంది. ఇప్పుడు బౌలర్లు, ఆటగాళ్లతో అతనికి మంచి సమన్వయం ఉంది. కిషన్‌ను కెప్టెన్‌గా కొనసాగించడమే జట్టుకు ప్రయోజనం' అని హర్భజన్ సూచించారు.
ఇదే అభిప్రాయాన్ని మాజీ భారత కోచ్ సంజయ్ బంగర్ కూడా వ్యక్తం చేశారు. కిషన్ కెప్టెన్సీని ప్రశంచారు. అతను బౌలర్లను సరిగ్గా ఉపయోగిస్తున్నాడని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని పేర్కొన్నారు. పాట్ కమిన్స్ వచ్చినా.. ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్‌గా ఇషాన్‌నే కొనసాగించాలి అని బంగర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుంటే.. ఇషాన్ కిషన్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. చూడాలి మరి సన్‌రైజర్స్ యాజమాన్యం ఏ నిర్ణయం తీసుకుంటుందో.
ఐపీఎల్ 2026లో ఇషాన్ కిషన్ నాయకత్వంలో ఎస్ఆర్‌హెచ్ ప్రారంభంలో కొంత తడబడింది. తొలి మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఓటమి పాలైంది. అయితే తరువాత కోల్‌కతాపై భారీ విజయం సాధించింది. మధ్యలో లక్నో, పంజాబ్ జట్లపై ఓటములు ఎదుర్కొన్నా.. తర్వాత మళ్లీ పుంజుకుంది. తాజాగా రాజస్థాన్, చెన్నై, ఢిల్లీలపై వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం +0.820 నెట్ రన్‌రేట్‌తో మంచి స్థితిలో ఉంది.