Shubman Gill: ఇక సైలెంట్‌గా వెళ్లిపోండి.. చెన్నై ఫ్యాన్స్‌కు కెప్టెన్ గిల్ వార్నింగ్..!

Shubman Gill: గురువారం జరిగిన గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ చేసిన సెలెబ్రేషన్ హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2026-05-22 04:06 GMT

Shubman Gill: ఇక సైలెంట్‌గా వెళ్లిపోండి.. చెన్నై ఫ్యాన్స్‌కు కెప్టెన్ గిల్ వార్నింగ్..!

CSK Fans : ఐపీఎల్ మ్యాచ్ అంటే కేవలం బ్యాట్, బాల్ మధ్య జరిగే ఫైట్ మాత్రమే కాదు.. ప్లేయర్ల మధ్య ఉండే అగ్రెషన్, ఫ్యాన్స్‌తో ఆడుకునే మైండ్ గేమ్స్ కూడా. రీసెంట్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో.. విజిల్ వేసుకుంటూ సైలెంట్‌గా ఇంటికి వెళ్లిపోండి అంటూ ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన సంగతి మరువక ముందే.. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్, ప్రిన్స్ శుభ్‌మన్ గిల్ కూడా సీఎస్‌కే ఫ్యాన్స్‌కు మైదానంలోనే ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

గురువారం జరిగిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ క్రమంలో చెన్నై పవర్‌ఫుల్ హిట్టర్ శివమ్ దూబే క్రీజులో ఊపుమీద ఉన్నాడు. క్రీజులో సెట్ అయి భారీ షాట్లతో గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడటానికి దూబే ప్రయత్నించాడు. ఒక భారీ షాట్ ఆడాడు కూడా. కానీ అక్కడే అసలైన ట్విస్ట్ ఎదురైంది. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నమ్మశక్యం కాని రీతిలో, గాల్లోకి లేచి ఒక స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకోవడంతో శివమ్ దూబే కథ ముగిసింది. ఆ వికెట్ పడటంతో గుజరాత్ క్యాంప్‌లో ఆనందం అంబరాన్నంటింది.

స్టేడియం అంతా ఎల్లో ఆర్మీ అరుపులతో హోరెత్తిపోతున్న వేళ.. శివమ్ దూబే వికెట్ పడగానే స్టేడియం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఇదే తరుణంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేరుగా చెన్నై అభిమానులు కూర్చున్న స్టాండ్స్ వైపు చూస్తూ.. ఇక సైలెంట్‌గా ఉండిపోవాలి అనే అర్థం వచ్చేలా నోటిపై వేలు వేసి వినూత్నంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఎప్పుడూ కూల్‌గా ఉండే గిల్ నుంచి ఇలాంటి అగ్రెసివ్ సెలెబ్రేషన్ ఊహించని ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు.

శుభ్‌మన్ గిల్ చేసిన ఈ యాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య, ముఖ్యంగా సీఎస్‌కే ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధానికే దారితీసింది. మొన్న ఇషాన్ కిషన్ మా విజిల్స్ ఆపేయమన్నాడు, ఇప్పుడు గిల్ వచ్చి సైలెంట్‌గా ఉండమంటున్నాడు. మా ధోనీ టీమ్‌పై మీకెందుకంత కసి? అంటూ చెన్నై ఫ్యాన్స్ గిల్ పోస్టుల కింద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనా, ప్లేఆఫ్స్ రేసు దగ్గరపడుతున్న కొద్దీ ఐపీఎల్ మ్యాచ్‌ల వేడి నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంటోంది. మైదానంలో ఆటగాళ్ల మధ్య ఉండే ఈ చిన్నపాటి రైవల్రీ, సెలెబ్రేషన్లే ఐపీఎల్‌ను ప్రపంచంలోనే బెస్ట్ లీగ్‌గా మారుస్తున్నాయి.


Tags:    

Similar News