Shubman Gill: సారా టెండూల్కర్‌‌కు హ్యాండిచ్చిన శుభ్‌మన్ గిల్.. భలే ట్విస్ట్ ఇచ్చాడు భయ్యా..!

Shubman Gill: ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్-1 వేళ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కొత్త లవ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి.

Update: 2026-05-27 05:54 GMT

Shubman Gill: సారా టెండూల్కర్‌‌కు హ్యాండిచ్చిన శుభ్‌మన్ గిల్.. భలే ట్విస్ట్ ఇచ్చాడు భయ్యా..!

Supriya Bhatt: భారత క్రికెట్ యువ సంచలనం, గుజరాత్ టైటాన్స్ స్టైలిష్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. ఒకవైపు ఐపీఎల్ 2026 సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌తో కెప్టెన్‌గా బాధ్యతలను భుజాన వేసుకుని, జట్టును విజయవంతంగా ప్లేఆఫ్స్ వరకు నడిపించిన గిల్.. మరోవైపు తన వ్యక్తిగత జీవితంతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో గిల్ ప్రేమాయణంలో ఉన్నాడంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు సారా చాప్టర్ పక్కకు వెళ్ళిపోయి.. ఒక సరికొత్త అమ్మాయి పేరు తెరపైకి రావడం క్రికెట్, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఆరు నెలలుగా సీక్రెట్ డేటింగ్?

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. శుభ్‌మన్ గిల్ సుప్రియా భట్ అనే అమ్మాయితో గత ఆరు నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా సీక్రెట్ డేటింగ్‌లో ఉన్నాడంటూ ప్రచారం జోరందుకుంది. ఇటీవల అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ ఆడిన చివరి లీగ్ మ్యాచ్‌కు సుప్రియా భట్ హాజరైనట్లు తెలుస్తోంది. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆమె రహస్యంగా గిల్‌ను కలిసి ముచ్చటించిందని, ఇద్దరి మధ్య చాలా రోజులుగా క్లోజ్ రిలేషన్ నడుస్తోందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. క్వాలిఫైయర్-1 కు కూడా? బెంగళూరు, గుజరాత్ జట్ల మధ్య ధర్మశాలలో జరిగిన హై-వోల్టేజ్ క్వాలిఫైయర్-1 మ్యాచ్‌కు సైతం ఆమె గిల్‌ను ఉత్సాహపరచడానికి స్టేడియానికి వచ్చిందంటూ వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

అసలు నిజం ఏంటంటే.?

సారా టెండూల్కర్ లేదా బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ వంటి పేర్లతో గిల్ లింక్ అప్ రూమర్స్ రావడం మనకు తెలిసిందే. అయితే ఈసారి పూర్తిగా కొత్తగా సుప్రియా భట్ అనే పేరు వెలుగులోకి రావడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే శుభ్‌మన్ గిల్ గతంలోనే తన రిలేషన్‌షిప్ రూమర్లపై స్పందిస్తూ తాను సింగిల్‌గా ఉన్నానని, ఏడాదిలో దాదాపు 300 రోజులు ప్రయాణాల్లోనే గడుపుతామని, డేటింగ్ చేయడానికి సమయం ఎక్కడిదని స్పష్టం చేశాడు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ సుప్రియా భట్ మ్యాటర్‌పై కూడా గిల్ వైపు నుంచి కానీ, అటువైపు నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.


Tags:    

Similar News