Shresta Iyer: పంజాబ్ కొంపముంచిన శ్రేయస్ అయ్యర్ సిస్టర్.. ఆ రోజు ఆ తప్పు చేయకుండా ఉండి ఉంటే..!
Shresta Iyer: ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేసు నుండి పంజాబ్ కింగ్స్ (PBKS) అధికారికంగా ఎలిమినేట్ అయింది.
Shresta Iyer: పంజాబ్ కొంపముంచిన శ్రేయస్ అయ్యర్ సిస్టర్.. ఆ రోజు ఆ తప్పు చేయకుండా ఉండి ఉంటే..!
Punjab Kings: ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ ఊహించని మలుపులతో క్రికెట్ అభిమానులకు పిచ్చెక్కిస్తోంది. ఒకే ఒక్క పాయింట్.. ఒకే ఒక్క ఓవర్ కాన్ఫిడెన్స్ రీల్ ఒక జట్టు తలరాతను ఎలా మార్చేస్తుందో పంజాబ్ కింగ్స్ ఎలిమినేషన్‌తో మరోసారి రుజువైంది. ఒకప్పుడు కేకేఆర్ జట్టును ఒక్క పాయింట్ దానం చేశాం అంటూ వెక్కిరించిన పంజాబ్ కింగ్స్, ఇప్పుడు అదే సింగిల్ పాయింట్ తేడాతో ప్లే ఆఫ్స్ రేసు నుండి అధికారికంగా తప్పుకుంది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించి 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఖాతాలో కేవలం 15 పాయింట్లు మాత్రమే ఉండడంతో ఆ జట్టు కథ ముగిసింది. ఈ ఎలిమినేషన్ తర్వాత సోషల్ మీడియాలో పంజాబ్ ఫ్యాన్స్ కంటే ఎక్కువగా.. శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ట అయ్యర్ టార్గెట్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..?
కొన్ని రోజుల క్రితం వర్షం కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్ , పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. వర్షం వల్ల ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. అయితే, వరుసగా 6 విజయాలు నమోదు చేసి ఫుల్ జోష్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్‌కు సపోర్ట్ చేస్తూ.. టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ట అయ్యర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వివాదాస్పద రీల్ పోస్ట్ చేసింది. మా పంజాబీలు చాలా మంచివాళ్లు.. అందుకే కేకేఆర్ పాపం అని ఒక పాయింట్ దానం చేశారు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాయి.
దానం చేసిన పాయింటే శాపమైంది
అక్కడి నుంచి మొదలైన పంజాబ్ కింగ్స్ పతనం.. చివరికి ఎలిమినేషన్‌తో ముగిసింది. కేకేఆర్‌ను ట్రోల్ చేస్తూ శ్రేష్ట అయ్యర్ వేసిన ఆ ఒక్క పాయింట్ జోక్, ఇప్పుడు పంజాబ్ కింగ్స్ గుండెల్లో గునపమైంది. రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో క్వాలిఫై అవ్వగా, పంజాబ్ 15 పాయింట్లతో ఇంటిబాట పట్టింది. అంటే.. ఆ రోజు కేకేఆర్‌తో మ్యాచ్ జరిగి, పంజాబ్ గెలిచి ఉంటే ఈరోజు సీన్ వేరేలా ఉండేది. కర్మ ఈజ్ ఎ బూమరాంగ్.. ఎవరినైతే తక్కువ చేసి చూశారో, అదే ఒక్క పాయింట్ మిమ్మల్ని టోర్నమెంట్ నుండి తరిమేసింది అంటూ కేకేఆర్, ఆర్‌ఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు.
శ్రేష్ట అయ్యర్‌ను ఆడుకుంటున్న నెటిజన్లు
పంజాబ్ వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచినప్పుడు స్టేడియంలో ఎగిరి గంతేసిన శ్రేష్ట అయ్యర్ పాత వీడియోలను, ఆ దానం రీల్‌ను మిక్స్ చేసి నెటిజన్లు దారుణంగా మీమ్స్ ట్రోల్స్ చేస్తున్నారు.ఇప్పుడు ఏం చేస్తావ్ శ్రేష్టా? పంజాబీలు చాలా మంచివాళ్లు కదా.. ప్లే ఆఫ్స్ బెర్త్‌ను కూడా రాజస్థాన్‌కు దానం చేసేశారు అంటూ కౌంటర్లు వేస్తున్నారు. లగేజ్ సర్దుకుని ఇంటికి వెళ్లి ఆడుకోండి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. క్రికెట్‌లో ఆట ముగిసేవరకు, పాయింట్ల పట్టిక తేలేవరకు ఏదీ శాశ్వతం కాదని పంజాబ్ ఎలిమినేషన్ మరోసారి ప్రూవ్ చేసింది. శ్రేష్ట అయ్యర్ చేసిన చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ రీల్.. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి, అభిమానులకు తీరని తలనొప్పిగా మారింది.