Sanju Samson: మాన్‌స్టర్ కాచుకొని కూర్చుకున్నాడు.. ఆడకుంటే అంతే సంగతులు సంజు!
Sanju Samson: Sanjay Manjrekar warns Sanju Samson. ఓపెనర్ సంజు శాంసన్ వైఫల్యంపై నెటిజెన్స్ మండిపడుతున్నారు.
Sanju Samson: మాన్‌స్టర్ కాచుకొని కూర్చుకున్నాడు.. ఆడకుంటే అంతే సంగతులు సంజు!
Sanju Samson: ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు అనూహ్య ఓటమిని ఎదుర్కొంది. పసికూనపై 34 పరుగుల తేడాతో ఓడిన తర్వాత టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఓపెనర్ సంజు శాంసన్ వైఫల్యంపై నెటిజెన్స్ మండిపడుతున్నారు.
మాజీ భారత క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా సంజు వైఫల్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడని, సంజూ ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
వైభవ్ నుంచి గట్టి పోటీ ఉంది:
సోనీ స్పోర్ట్స్‌తో మాట్లాడిన సంజయ్ మంజ్రేకర్.. 'సంజు శాంసన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ కాచుకొని ఉన్నాడు. సంజు స్థానంతో పాటు అభిషేక్ శర్మ స్థానం పైనా బుడ్డోడు కన్నేశాడు. యువ ఆటగాడు టీమిండియా అరంగేట్రం కోసం సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎవరూ తమ స్థానాన్ని తేలికగా తీసుకోకూడదు.
పరుగులు చేయకుంటే వైభవ్ జట్టులోకి వస్తాడు. భారత జట్టులో ఎంతటి పోటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. ఒకేసారి జట్టులో స్థానం కోల్పోతే.. మరలా తిరిగి రావడం కష్టం. ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో అభిషేక్ రన్స్ చేశాడు. సంజు మాత్రం విఫలమయ్యాడు. ఇప్పుడు కత్తి సంజు మెడపై ఉంది' అని చెప్పారు.
వైభవ్ ఆడినా పెద్దగా తేడా ఉండేది కాదు:
తొలి టీ20లో వైభవ్ సూర్యవంశీ ఆడినా మ్యాచ్ ఫలితం పూర్తిగా మారేదని తాను భావించడం లేదని సంజయ్ మంజ్రేకర్ చెప్పారు. 'వైభవ్ ఆడితే అభిషేక్ శర్మలా దాడిగా ఆడేవాడు. లేదా ఇంకొంచెం మెరుగ్గా ఆడేవాడేమో. కానీ 183 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే తొలి ఆరు ఓవర్లలోనే దూకుడుగా ఆడాల్సి వచ్చింది.
ఆ తర్వాత కూడా అదే వేగాన్ని కొనసాగించాలి. పిచ్ పరిస్థితులు కూడా బ్యాటింగ్‌కు అంత అనుకూలంగా లేవు. అందుకే వైభవ్ ఉన్నా పెద్దగా మార్పు వచ్చేదని చెప్పలేం' అని విశ్లేషించారు. ఏదేమైనా మాన్‌స్టర్ కాచుకొని కూర్చుకున్నాడని.. ఓపెనర్లు ఆడకుంటే అంతే సంగతులు అని మంజ్రేకర్ హెచ్చరించారు.
నిరాశపర్చిన సంజు:
బెల్‌ఫాస్ట్‌లో జరిగిన తొలి టీ20లో భారత జట్టు టాప్ ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌లతోనే బరిలోకి దిగింది. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్ర అవకాశం దక్కలేదు. సంజు మాత్రం నాలుగు బంతులు మాత్రమే ఎదుర్కొని ఐదు పరుగులు చేశాడు. అరంగేట్ర బౌలర్ జై మూంద్రా బౌలింగ్‌లో అతడు ఔటయ్యాడు. మరోవైపు అభిషేక్ శర్మ 20 బంతుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించినప్పటికీ.. మిగతా బ్యాటర్లు విఫలమవడంతో భారత్ 148 పరుగులకే ఆలౌట్ అయింది.
ఐర్లాండ్ చారిత్రక విజయం:
ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 182/9 పరుగులు చేసింది. అనంతరం అద్భుతంగా బౌలింగ్ చేసిన మాథ్యూ హోలార్డ్, మాథ్యూ హంఫ్రీస్ తలా మూడు వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. దీంతో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించి.. అన్ని ఫార్మాట్లలో భారత్‌పై తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు రెండో టీ20లో టీమిండియా తప్పక గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కుతుందా? లేదా మళ్లీ బెంచ్‌కే పరిమితమవుతాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.