Ruturaj Gaikwad: బంపరాఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్‌గా నియామకం.. స్టార్ ఆటగాళ్లతో బలమైన జట్టు!
Ruturaj Gaikwad will lead West Zone squad in the Duleep Trophy 2026. భారత ఓపెనర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు.
Ruturaj Gaikwad: బంపరాఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్‌గా నియామకం.. స్టార్ ఆటగాళ్లతో బలమైన జట్టు!
Ruturaj Gaikwad: భారత ఓపెనర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. దులీప్ ట్రోఫీ 2026 కోసం ఎంపిక చేసిన వెస్ట్‌జోన్ జట్టుకు కెప్టెన్‌గా నియామకం అయ్యాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ షమ్స్ ములానీని వైస్ కెప్టెన్‌గా సెలెక్టర్లు నియమించారు. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 10 వరకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) మైదానాల్లో ఈ ప్రతిష్టాత్మక టోర్నీ జరగనుంది. సోమవారం జరిగిన జోనల్ సెలక్షన్ కమిటీ సమావేశంలో వెస్ట్‌జోన్ జట్టును అధికారికంగా ప్రకటించారు.
గత ఏడాది వెస్ట్‌జోన్‌కు భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ నాయకత్వం వహించాడు. అతని సారథ్యంలో జట్టు సెమీఫైనల్ వరకు చేరుకున్నప్పటికీ.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా సెంట్రల్ జోన్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈసారి మాత్రం కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించారు. ఇటీవల శ్రీలంక ‘ఏ’ జట్టుతో జరిగిన వన్డే ట్రైసిరీస్, రెడ్‌బాల్ మ్యాచ్‌ల కోసం భారత ‘ఏ’ జట్టులో చోటు దక్కించుకున్న రుతురాజ్‌పై సెలెక్టర్లు నమ్మకం ఉంచారు.
వెస్ట్‌జోన్ జట్టులో బ్యాటింగ్ విభాగం ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, జయ్‌మీత్ పటేల్, శివాలిక్ శర్మ వంటి ప్రతిభావంతులైన బ్యాటర్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. రుతురాజ్, పృథ్వీ షా, సర్ఫరాజ్, ముషీర్ ఐపీఎల్ టోర్నీలో మెరిశారు. వికెట్ కీపర్‌లుగా హార్విక్ దేశాయ్, ఉర్విల్ పటేల్ ఎంపిక అయ్యారు. ఐపీఎల్ 2026లో చెన్నై తరఫున ఉర్విల్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన విషయం తెలిసిందే.
బౌలింగ్ విభాగంలో వైస్ కెప్టెన్ షమ్స్ ములానీ కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అతనికి తోడుగా తనుష్ కోటియన్, సిద్ధార్థ్ దేశాయ్ స్పిన్ విభాగాన్ని ముందుండి నడిపించనున్నారు. పేస్ బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్‌తో పాటు తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, ఆల్‌రౌండర్ అతిత్ షెత్ చోటు దక్కించుకున్నారు. శార్దూల్, తుషార్, ముఖేష్ లకు మంచి ఐపీఎల్ అనుభవం ఉంది ఈ బౌలింగ్ దళం ప్రత్యర్థి బ్యాటర్లకు గట్టి సవాల్ విసిరేలా కనిపిస్తోంది. గాయాలను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు ఆరుగురు రిజర్వ్ ఆటగాళ్లను కూడా ఎంపిక చేశారు. జయ్ గోహిల్, ఆర్య దేశాయ్, అర్షిన్ కులకర్ణి, మహేశ్ పిఠియా, విశాల్ జైస్వాల్, రాజ్‌వర్ధన్ హంగర్‌గేకర్ రిజర్వ్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
రుతురాజ్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, శార్దూల్ భారత జట్టు తరఫున ఆడిన విషయం తెలిసిందే. స్టార్ ఆటగాళ్లతో కూడిన ఈ వెస్ట్‌జోన్ జట్టు దులీప్ ట్రోఫీలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో జట్టు ఎలా రాణిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వెస్ట్‌జోన్ జట్టు:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), షమ్స్ ములానీ (వైస్ కెప్టెన్), హార్విక్ దేశాయ్ (వికెట్‌కీపర్), ఉర్విల్ పటేల్ (వికెట్‌కీపర్), జయ్‌మీత్ పటేల్, పృథ్వీ షా, శివాలిక్ శర్మ, సిద్ధార్థ్ దేశాయ్, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, అతిత్ షెత్, ముఖేష్ చౌదరి, తనుష్ కోటియన్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే.
రిజర్వ్ ఆటగాళ్లు:
జయ్ గోహిల్, ఆర్య దేశాయ్, అర్షిన్ కులకర్ణి, మహేశ్ పిఠియా, విశాల్ జైస్వాల్, రాజ్‌వర్ధన్ హంగర్‌గేకర్.