Rinku Singh: 6,6,6,6,4,4.. 414 స్ట్రైక్ రేట్‌తో టీమిండియా సిక్సర్ సింగ్ ఊచకోత..!
Rinku Singh: రింకు సింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మీరట్ మావెరిక్స్, యూపీ టీ20 లీగ్ 2026 టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌లల్లోనూ 6 గెలిచింది.
Rinku Singh: 6,6,6,6,4,4.. 414 స్ట్రైక్ రేట్‌తో టీమిండియా సిక్సర్ సింగ్ ఊచకోత..!
Rinku Singh: యూపీ టీ20 లీగ్ 2026లో రింకు సింగ్ బౌండరీలతో రెచ్చిపోయాడు. టోర్నమెంట్‌లోని 16వ మ్యాచ్‌లో మీరట్ మావెరిక్స్, గోరఖ్‌పూర్ లయన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రింకు సింగ్ విధ్వంసం సృష్టించాడు.
కేవలం 6.4 ఓవర్లలోనే మీరట్ జట్టు లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు. మీరట్ జట్టు కెప్టెన్ రింకు కేవలం 7 బంతుల్లోనే 414.29 స్ట్రైక్ రేట్‌తో 29 పరుగులు బాదాడు. కాగా, ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా, మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు.
మొదట బ్యాటింగ్ చేసిన ఆర్యన్ జుయల్ కెప్టెన్సీలోని గోరఖ్‌పూర్ లయన్స్ నిర్ణీత 8 ఓవర్లలో 91 పరుగులు చేసింది. ఆ తర్వాత మీరట్ మావెరిక్స్ వికెట్ నష్టపోకుండా 6.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. అక్షయ్ దుబే గాయంతో రిటైర్డ్ హర్ట్ అవ్వడంతో రింకూ సింగ్ క్రీజులోకి ఎంట్రీ ఇచ్చి బీభత్సం సృష్టించాడు.
414 స్ట్రైక్ రేట్‌తో రింకు ఇన్నింగ్స్..
మీరట్ మావెరిక్స్ బ్యాటింగ్ చేస్తుండగా, ఐదవ ఓవర్ మూడో బంతికి అక్షయ్ దుబే గాయంతో రిటైర్ అయ్యాడు. అతని తర్వాత కెప్టెన్ రింకు సింగ్ బ్యాటింగ్ కు వచ్చాడు. గెలవడానికి మీరట్ కు చివరి మూడు ఓవర్లలో 36 పరుగులు అవసరమయ్యాయి.
విశాల్ నిషాద్ వేసిన ఆరో ఓవర్‌లో రింకు సింగ్ 3 సిక్సర్లు, 2 ఫోర్లు బాది మొత్తం 28 పరుగులు చేశాడు. మరోవైపు స్వస్తిక్ చికారా 24 బంతుల్లో 44 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఈ క్రమంలో రింకు కేవలం 7 బంతుల్లోనే 414.29 స్ట్రైక్ రేట్‌తో 29 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 2 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు.
గేమ్‌ను మార్చేసిన జీషన్ అన్సారీ..
గోరఖ్‌పూర్ లయన్స్ మొదటి 5 ఓవర్లలో 63 పరుగులు చేసింది. ఇదే జోరును కొనసాగించి ఉంటే, 100 పరుగుల మార్కును ఈజీగా చేరుకునేది. అయితే, 6వ ఓవర్‌లో జీషన్ అన్సారీ, ఆర్యన్ జుయల్, హర్దీప్ సింగ్‌ల వికెట్లను తీసి గోరఖ్‌పూర్‌కు డబుల్ దెబ్బ కొట్టాడు. జీషన్ ఈ మ్యాచ్‌లో మొత్తం 2 ఓవర్లు బౌలింగ్ చేసి, 10 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
టేబుల్ టాపర్ మీరట్ మావెరిక్స్..
రింకు సింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మీరట్ మావెరిక్స్, యూపీ టీ20 లీగ్ 2026 టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌లల్లోనూ 6 గెలిచింది. దీంతో 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మీరట్‌తో సమానంగా మ్యాచ్‌లు ఆడిన లక్నో ఫాల్కన్స్, కేవలం 6 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.