Most International Centuries by Wicket Keepers: ధోని కంటే అతనే తోపు.. అసలు మ్యాటర్ ఈ లిస్ట్‌లోనే ఉంది భయ్యో..!

Most International Centuries by Wicket Keepers: అంతర్జాతీయ క్రికెట్‌లో వికెట్ కీపర్లది కూడా కీలక పాత్ర ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటు కీపింగ్‌లోనే కాదు, అటు బ్యాటింగ్‌లోనూ మోత మోగించిన దిగ్గజాలు ఎందరో ఉన్నారు.

Update: 2026-08-25 04:47 GMT

Most International Centuries by Wicket Keepers: ధోని కంటే అతనే తోపు.. అసలు మ్యాటర్ ఈ లిస్ట్‌లోనే ఉంది భయ్యో..!

Most International Centuries by Wicket Keepers: వికెట్ కీపర్ అంటే స్టంప్స్ వెనుక బంతిని అందుకునే ఆటగాడు మాత్రమే కాదు. బ్యాట్‌తోనూ జట్టుకు కీలకంగా మారిన పలువురు కీపర్లు అంతర్జాతీయ క్రికెట్‌లో భారీ శతకాల రికార్డులు నమోదు చేశారని మీకు తెలుసా? ఈ జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ అగ్రస్థానంలో నిలిచాడు. ఆయన తర్వాతి స్థానాల్లో ఉన్న కీపర్లు ఎవరో ఓసారి చూద్దాం.

వికెట్ కీపర్లలో గిల్‌క్రిస్ట్‌దే ఆధిపత్యం..

అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి అత్యధిక సెంచరీలు సాధించిన వికెట్ కీపర్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్ నిలిచాడు. ఆస్ట్రేలియా మాజీ కీపర్-బ్యాట్స్‌మెన్ తన కెరీర్‌లో మొత్తం 33 శతకాలు బాదాడు.

అందులో 17 టెస్టు సెంచరీలు, 16 వన్డే సెంచరీలు ఉన్నాయి. దూకుడైన బ్యాటింగ్‌తో కీపర్ పాత్రకు కొత్త రూపం తీసుకొచ్చిన గిల్‌క్రిస్ట్‌ ఈ గణాంకాల్లోనూ తన ప్రత్యేకత చాటుకున్నాడు. ఆయన తర్వాత దక్షిణాఫ్రికా స్టార్ క్వింటన్ డి కాక్ 31 శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. డి కాక్‌ టెస్టుల్లో ఆరు, వన్డేల్లో 23, టీ20ల్లో రెండు సెంచరీలు నమోదు చేశాడు.

సంగక్కర, షాయ్ హోప్‌ కూడా టాప్‌లో..

ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర మూడో స్థానంలో ఉన్నాడు. ఆయన అంతర్జాతీయ కెరీర్‌లో 30 సెంచరీలు సాధించాడు. వాటిలో ఏడు టెస్టుల్లో, 23 వన్డేల్లో వచ్చాయి. వెస్టిండీస్‌ ఆటగాడు షాయ్ హోప్ 21 శతకాలతో నాలుగో స్థానంలో నిలిచాడు. హోప్‌ ఖాతాలో 19 వన్డే, ఒక టెస్టు, ఒక టీ20 సెంచరీ ఉన్నాయి.

ధోనీ కంటే ముందున్న ఏబీ డి విలియర్స్..

దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డి విలియర్స్ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. వికెట్ కీపర్‌గా అతని పేరిట 17 సెంచరీలు ఉన్నాయి. అందులో ఏడు టెస్టుల్లో, పది వన్డేల్లో సాధించాడు. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 16 అంతర్జాతీయ శతకాలతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. ధోనీ టెస్టుల్లో ఆరు, వన్డేల్లో పది సెంచరీలు నమోదు చేశాడు.

జింబాబ్వే దిగ్గజం ఆండీ ఫ్లవర్ కూడా 16 సెంచరీలతో ధోనీతో సమానంగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఆయన 12 టెస్టు, నాలుగు వన్డే శతకాలు సాధించాడు. ఈ గణాంకాలు వికెట్ కీపర్ పాత్రలో బ్యాటింగ్ ప్రాధాన్యం ఎంత పెరిగిందో చూపిస్తున్నాయి. 33 అంతర్జాతీయ సెంచరీలతో గిల్‌క్రిస్ట్‌ అగ్రస్థానంలో ఉండగా, డి కాక్‌, సంగక్కర వంటి దిగ్గజాలు అతని వెనుక నిలిచారు.

Tags:    

Similar News