IND vs ZIM: సంజుకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. బుడ్డోడికి మరో అవకాశం.. జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ఇదే!
Sanju Samson Snub in India's squad for the Zimbabwe T20I series 2026. జింబాబ్వే పర్యటన కోసం భారత టీ20 జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది.
IND vs ZIM: సంజుకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. బుడ్డోడికి మరో అవకాశం.. జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ఇదే!
IND vs ZIM: జింబాబ్వే పర్యటన కోసం భారత టీ20 జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం ప్రకటించింది. జూలైలో హరారే వేదికగా జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియాకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనున్నాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరోసారి జట్టులో చోటు దక్కింది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌కు బీసీసీఐ సెలెక్టర్లు బిగ్ షాక్ ఇచ్చారు. సంజుకు భారత జట్టులో అవకాశం ఇవ్వలేదు.
ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై సెలెక్టర్లు మరోసారి విశ్వాసం ఉంచారు. అభిషేక్ శర్మతో కలిసి అతడు ఓపెనింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు కల్పించే లక్ష్యంతో బీసీసీసీ సెలక్షన్ కమిటీ ఈ జట్టును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వికెట్ కీపర్లుగా ఇషాన్ కిషన్, ప్రభ్‌సిమ్రన్ సింగ్‌లకు చోటు లభించింది. బ్యాటింగ్ విభాగంలో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, రింకూ సింగ్, సూర్యాంశ్ షెడ్జే, శివమ్ దూబేలకు అవకాశం దక్కింది.
బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్‌లకు చోటు దక్కింది. యువ పేసర్లు, స్పిన్నర్లకు సమాన ప్రాధాన్యం ఇస్తూ సెలెక్టర్లు జట్టును ఎంపిక చేశారు. రింకూ సింగ్, హర్ష్ దూబే, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్‌లకు కొత్తగా బీసీసీఐ అవకాశం ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో బీసీసీఐ కీలక మార్పు చేసింది. గాయపడిన నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో శివమ్ దూబేను భారత వన్డే జట్టులోకి ఎంపిక చేసింది. దీంతో దూబేకు ఒకేసారి టీ20, వన్డే జట్లలో చోటు దక్కింది. యువ ఆటగాళ్లకు వరుసగా అవకాశాలు ఇస్తున్న బీసీసీఐ.. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త జట్టును తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోందని స్పష్టమవుతోంది.
జింబాబ్వే పర్యటనకు భారత టీ20 జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్)
వైభవ్ సూర్యవంశీ
అభిషేక్ శర్మ
తిలక్ వర్మ (వైస్ కెప్టెన్)
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్)
శివమ్ దూబే
సూర్యాంశ్ షెడ్జే
రింకూ సింగ్
హర్ష్ దూబే
వరుణ్ చక్రవర్తి
ప్రిన్స్ యాదవ్
యశ్ ఠాకూర్
అశోక్ శర్మ
మయాంక్ యాదవ్
ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్)
జింబాబ్వే పర్యటన షెడ్యూల్:
జూలై 23, 2026 – తొలి టీ20
జూలై 25, 2026 – రెండో టీ20
జూలై 26, 2026 – మూడో టీ20