IND vs AFG: ఆడింది ఒక ఓవరే.. అయినా చరిత్ర సృష్టించిన టీమిండియా!

IND vs AFG: Team India History. వన్డే చరిత్రలో టీమిండియా కొత్త రికార్డు నమోదు చేసింది.

Update: 2026-06-20 13:11 GMT

IND vs AFG: ఆడింది ఒక ఓవరే.. అయినా చరిత్ర సృష్టించిన టీమిండియా!

IND vs AFG అఫ్గానిస్థాన్‌తో చెన్నైలో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత ఆరంభం ఇచ్చాడు. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. తొలి ఓవర్‌లోనే ఏకంగా 23 పరుగులు సాధించింది. దాంతో వన్డే చరిత్రలో టీమిండియా కొత్త రికార్డు నమోదు చేసింది. ఒక వన్డే ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో అత్యధిక పరుగులు భారత జట్టు చేసింది. గతంలో తన రికార్డును థానే టీమిండియా మెరుగుపరుచుకుంది.

మ్యాచ్ ప్రారంభానికి ముందే అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ పిచ్‌లోని డేంజర్ ఏరియాపై పరుగెత్తినందుకు ఐసీసీ నిబంధనల ప్రకారం ఐదు పెనాల్టీ పరుగులు భారత్ ఖాతాలో జమ అయ్యాయి. దీంతో టీమిండియా 5/0తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అనంతరం తొలి ఓవర్ వేసిన అజ్మతుల్లా ఒమర్జాయ్‌ 18 రన్స్ ఇచ్చాడు.

జైస్వాల్ 14 పరుగులు చేయగా.. అదనంగా రెండు వైడ్లు, రెండు నోబాల్స్ రావడంతో ఒమర్జాయ్ మొత్తం 18 పరుగులు సమర్పించుకున్నాడు. పెనాల్టీ పరుగులతో కలిపి భారత్ తొలి ఓవర్ ముగిసే సరికి 23 పరుగులకు చేరుకుంది. దీంతో భారత్ వన్డేల్లో తొలి ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన జట్టు రికార్డును నెలకొల్పింది.

ఇంతకుముందు భారత్ తొలి ఓవర్‌లో అత్యధికంగా 22 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌పై 2004లో కొలంబో ఎస్‌ఎస్‌సీ మైదానంలో ఏఈ రన్స్ సాధించింది. ఆ తర్వాత 2020లో ఆస్ట్రేలియాపై సిడ్నీలో 20 పరుగులు నమోదు చేసింది. ఇప్పుడు అఫ్గానిస్థాన్‌పై 23 పరుగులతో ఆ రికార్డులను అధిగమించింది.

ఈ మ్యాచులో అఫ్గానిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేసి 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అఫ్గాన్ భారీ స్కోరు చేయలేకపోయింది. హష్మతుల్లా షాహిది (102; 131 బంతుల్లో), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (50; 56 బంతుల్లో) జట్టును ఆదుకున్నారు. ప్రసిద్ధ్‌ కృష్ణ (5/23) చెలరేగాడు.

అనంతరం లక్ష్య ఛేదనను భారత్ దూకుడుగా ప్రారంభించింది. 8 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడుతున్నాడు. 24 బంతుల్లో 38 రన్స్ చేశాడు. రోహిత్ శర్మ 29 బంతుల్లో 26 పరుగులు చేశాడు. భారత్ లక్ష్యం దిశగా సాఆగుతోంది. ఇంకా 142 రన్స్ చేసే. సిరీస్ క్లీన్ స్వీప్ అవుతుంది.

ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లో భారత్ అత్యధిక పరుగులు:

23 (vs ఆఫ్ఘనిస్థాన్, చెన్నై 2026*)

22 (vs బంగ్లాదేశ్, కొలంబో SSC 2004)

20 (vs ఆస్ట్రేలియా, సిడ్నీ 2020)

Tags:    

Similar News