Australia Cricket: బంగ్లాదేశ్ చేతిలో ఘోర ఓటమి.. ఆస్ట్రేలియాకు రెండు షాక్‌లు.. భారీ ఫైన్‌తో పాటు!

Australia Cricket: బంగ్లాదేశ్‌ చేతిలో రెండు టెస్టుల సిరీస్‌లో 0-1తో వెనుకబడిన ఆసీస్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) దెబ్బ కొట్టింది.

Update: 2026-08-17 13:47 GMT

Australia Cricket: బంగ్లాదేశ్ చేతిలో ఘోర ఓటమి.. ఆస్ట్రేలియాకు రెండు షాక్‌లు.. భారీ ఫైన్‌తో పాటు!

Australia Cricket: బంగ్లాదేశ్‌ చేతిలో సొంత గడ్డపై ఆస్ట్రేలియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో ఘోర ప్రదర్శన చేసిన ఆసీస్.. మూల్యం చెల్లించుకుంది. పటిష్టమైన జట్టుతో బరిలోకి దిగిన ఆసీస్.. సొంత గడ్డపైనే బంగ్లా చేతిలో ఓడిపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆస్ట్రేలియా జట్టును ఆ దేశ మాజీలే విమర్శిస్తున్నారు. ఆస్ట్రేలియా టెస్టు జట్టులో మార్పులు తప్పవని అభిప్రాయపడ్డాడు. రెండు టెస్టుల సిరీస్‌లో 0-1తో వెనుకబడిన ఆసీస్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) దెబ్బ కొట్టింది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా జరిమానాతో పాటు ఒక మ్యాచ్‌ పాయింట్‌ను ఐసీసీ కోతగా విధించింది.

బంగ్లాదేశ్‌తో డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా నాలుగు ఓవర్లను తక్కువగా వేసింది. ఐసీసీ రూల్స్ ప్రకారం ఒక్కో స్లో ఓవర్‌కు ఒక్కో పాయింట్‌ కోత పడుతుంది. నాలుగు ఓవర్లు తక్కువగా వేయడంతో.. ఆసీస్‌కు నాలుగు పాయింట్ల కోత పడింది. మరోవైపు ఒక్కో ఆటగాడిపై ఐదు శాతం జరిమానా కూడా పడనుంది. దీంతో 11 మంది ప్లేయర్ల పైనా 4 వేల డాలర్ల చొప్పున.. 44 వేల డాలర్ల వరకూ జరిమానా పడనుంది. అయితే ఇదంతా మ్యాచ్‌ రిఫరీ నిర్ణయంపైనే ఆధారపడనుంది. ఈ పాయింట్ల కోత ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్పై ప్రభావం చూపనుంది.

డార్విన్ టెస్టులో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే ఆలౌటైంది. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ హసన్ మహ్మూద్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు. అనంతరం బంగ్లాదేశ్ బ్యాటర్లు పరిస్థితులను పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకున్నారు. తంజిద్ హసన్ తమీమ్ ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సెంచరీ (101) సాధించిన తొలి బంగ్లాదేశ్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. మెహిదీ హసన్ మిరాజ్ 65 పరుగులు చేయడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో బంగ్లాకు ఏకంగా 228 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది.

రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కాస్త మెరుగైన ఆటతీరు కనబరిచింది. కామెరాన్ గ్రీన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ సెంచరీ (104) బాదాడు. అయితే అతడికి మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. మెహిదీ హసన్ మిరాజ్ కీలక సమయంలో ఐదు వికెట్లు పడగొట్టడంతో ఆస్ట్రేలియా 284 పరుగులకే ఆలౌటైంది. దీంతో బంగ్లాదేశ్ ముందు 57 పరుగుల స్వల్ప విజయ లక్ష్యం మాత్రమే నిలిచింది. లక్ష్య ఛేదనలో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో తంజిద్ హసన్ త్వరగా ఔటైనప్పటికీ.. షద్మాన్ ఇస్లాం, మొమినుల్ హక్ ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు.

బంగ్లాదేశ్‌తో ఓటమి ఆస్ట్రేలియాకు అవమానకరం అని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. 'ఇది చాలా అవమానకరం. జట్టును పునర్నిర్మించే సమయం వచ్చేసింది. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓపెనింగ్ స్థానంతో పాటు నంబర్-3 స్థానంలోనూ కొత్త ఆటగాళ్లను తీసుకురావాలి. జట్టులో మార్పులు కోరుకునే వ్యక్తిని నేను కాదు. నేను కెప్టెన్‌గా ఉన్న సమయంలోనూ జట్టును సాధ్యమైనంత వరకు కొనసాగించడానికే ప్రయత్నించేవాడిని. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. యువ ఆటగాళ్లను తీసుకువచ్చి జట్టును పునర్నిర్మించే ప్రక్రియను ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది' అని పాంటింగ్ పేర్కొన్నాడు.

Tags:    

Similar News