Shakuni: కురువంశ వినాశనాన్ని కోరుకున్న శకుని పాండవులకు ఎందుకు అన్యాయం చేశాడో తెలుసా?
మహాభారతంలో శకుని కౌరవ, పాండవులకు ఎందుకు శతృవుగా మారాడు. భీముడితో పాటు సహదేవుడు కూడా ప్రతిజ్ఞచేసి శకునిని ఎందుకు చంపాడు...తెలుసుకుందాం.
Shakuni: ప్రతి మనిషి జీవితంలో శకుని ఉంటూనే ఉంటాడు. జీవితంలో శకుని ఎవరో తెలుసుకొని వారి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కౌరవుల్లా నాశనం కావడమే కాకుండా పాండవుల్లా కూడా అన్యాయానికి గురౌతాం. మహాభారతంలో శకుని ఎందుకు ప్రతివాదిగా మారాడు. అసలు శకునికి కౌరవులకు ఉన్న సంబంధం ఏంటి? పాండువులకు ఎందుకు అన్యాయం చేయాలని చూశాడు...తెలుసుకుందాం.
కౌరవులపై ప్రతికారం
శకుని కౌరవులకు స్వయానా బంధువే. కౌరవుల తల్లి గాంధారికి స్వయానా సోదరుడు. కౌరవుల మేనమామ. మాయా జూదంలో దిట్ట. ఈ జూదంతోనే కౌరవులను రెచ్చగొట్టి పాండవులు సర్వం కోల్పోయేలా చేశాడు. కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ప్రధాన కారకుడు శకుని. అతని పగ, కోపం కౌరవులపై కాదు...భీష్ముడు, దృతరాష్ట్రుడిపైనే. కానీ, కురువంశాన్ని పూర్తిగా నాశనం చేయాలని సంకల్పించుకోవడానికి ప్రధాన కారణం శకుని తండ్రి సుబలుడిని, శకుని సోదరులను జైలులో బంధించి వారికి తగిన ఆహారం ఇవ్వకుండా శిక్షిస్తాడు. దీంతో సుబలుడు, అతని కుమారులు మరణిస్తారు. భీష్ముడు తన సోదరి గాంధారిని అంధుడైన ధృతరాష్ట్రుడికి ఇచ్చి బలవంతంగా వివాహం చేయించాడు. దీనిని శకుని వంశం భరించలేకపోయింది. అయితే, గాంధారి జాతకంలో దోషం ఉందని తెలియడంతో ముందుగా ఆమెకు మేకతో వివాహం జరిపించి ఆ మేకను చంపేస్తారు. ఈ విషయం ధృతరాష్ట్రుడికి తెలియడంతో శకుని సుబలుడిని, అతని సోదరులను జైలులో బంధిస్తారు. ఆకలితో అలమటించి మరణించే ముందు సులబుడు తన కుమారుడైన శకునని పిలిచి కౌరవ వంశాన్ని నాశనం చేయమని కోరతాడు. అప్పటి నుంచి శకుని కౌరవుల పక్షాన ఉంటూ ఆ వంశంపై పగ తీర్చుకుంటాడు. ఈ నేపథ్యంలోనే దుర్యోధనుడిని తప్పుదోవ పట్టిస్తూ వారి వినాశనాన్ని కోరుకుంటాడు. పాండవులను మోసం చేయడంలోనూ, వారిని అపకీర్తిపాలు చేయడంలోనూ శకుని కీలకపాత్ర పోషిస్తాడు.
శకుని పాండవుల పక్షాన నిలిచాడా?
కౌరవుల వినాశనం కోరుకున్న శకుని పాండవులకు మేలు చేశాడా...వారికి సహాయం చేశాడా అంటే మహాభారతం లేదని చెబుతున్నది. కౌరవులను నాశనం చేసేందుకు పాండవులను కేవలం ఒక సాధనంగా మాత్రమే ఉపయోగించుకున్నాడు. పాండవులు రాజ్యం కోల్పోవడానికి, పాండవులు అడవులపాలు కావడానికి, పాండవులు అవమానాల పాలవ్వడానికి శకుని ఓ కారణం. దృతరాష్ట్రుడు పాండవుల రాజ్యాన్ని ఇవ్వడానికి దృతరాష్ట్రుడు ముందుకు వస్తే...శకుని దుర్యోధనుడిని రెచ్చగొట్టి పాండువులతో విరోధం పెంచుకుంటాడు. తండ్రిపై కూడా విరోధం పెంచుకునేలా చేస్తాడు శకుని. నిండు కురుసభలో ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో భీముడితో పాటు సహదేవుడు కూడా ప్రతిజ్ఞ చేస్తాడు. తన ప్రతిజ్ఞను కురుక్షేత్రంలో 18వ రోజున అంటే యుద్ధం ముగిసే రోజున సహదేవుడు శకునిని సంహరిస్తాడు.