Numerology: చూస్తే ముద్దుపెట్టుకోవాలనిపిస్తుందా?... మీరు పుట్టిన తేదీలను ఒకసారి చెక్‌చేసుకోండి

6, 15, 24 తేదీల్లో పుట్టినవారు ఎందుకు ఆకర్షణీయంగా ఉంటారో సంఖ్యాశాస్త్రం వివరిస్తుంది. మూల సంఖ్య 6పై శుక్రుడి ప్రభావం, వ్యక్తిత్వం, అదృష్టం, విజయ రహస్యాలను తెలుసుకోండి.

Update: 2026-06-05 04:22 GMT

Numerology: కొంతమంది పిల్లలను చూడగానే ముద్దుపెట్టుకోవాలని అనిపిస్తుంది. చాలా మంది పిల్లల తల్లిదండ్రులు చామనఛాయగా ఉన్నా...వారి పిల్లలు లేత రంగుల్లో మెరిసిపోతుంటారు. ముఖ కవళికలు, రూపలావణ్యాలు అద్భుతంగా ఉంటాయి. భవిష్యత్తులో ఇలాంటివారు ఉన్నతస్థాయికి ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలా మంచి రంగుల్లో పిల్లలు జన్మించడానికి కారణం వారు జన్మించిన తేదీలే అంటున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. సంఖ్యాశాస్త్రం ప్రకారం 6, 15, 24 తేదీల్లో పుట్టినవారు మంచి రంగులో ఉంటారని చెబుతున్నారు. సంఖ్యాశాస్త్రానికి రంగుకు ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సంఖ్యాశాస్త్రం...ఆకర్షణీయమైన రంగులు

జ్యోతిష్యశాస్త్రంలో సంఖ్యాశాస్త్రానికి ఓ ప్రాముఖ్యత ఉంటుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం 6,15,24 తేదీల్లో పుట్టినవారి మూలసంఖ్య 6 అవుతుంది. ఆరు సంఖ్యకు శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శుక్రుడు ప్రేమకు, అదృష్టానికి, శాంతికి గుర్తు. మూల సంఖ్య ఆరుగా ఉన్న జాతకుడిపై శుక్రుడి ప్రభావం కనిపిస్తుంది. ఈ సంఖ్యలో పుట్టిన అబ్బాయిలు అందరితో నవ్వుతూ, నవ్విస్తూ ఆకర్షణీయంగా ఉంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అందరితోనూ కలిసిపోయే స్వభావంతో ఉంటారు. వీరికి స్నేహితులు కూడా ఎక్కువే. జీవితంలో విజయం సాధించేందుకు ఎంతైనా శ్రమించేందుకు సిద్దంగా ఉంటారు. నిరంతరం ప్రయత్నం వీరికి వెన్నతో పెట్టిన విద్య. శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా... ఎదుటివారిని ఈజీగా ఆకర్షించే నైజం వీరిసొంతం. ఫ్యాషన్‌ రంగాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. తాను సంతోషంగా ఉంటూ ఎదుటివారిని సంతోషపరిచే వ్యక్తిత్వం వీరి సొంతం.

అమ్మాయిలు... రాణించే మహిళలు

ఇక ఆరు సంఖ్యలో జన్మించిన అమ్మాయిలు... పుట్టింటికి ఆనందాన్ని, సంతోషాన్ని, లక్ష్మీదేవిని తీసుకొస్తారు. ఉన్నత స్థాయికి ఎదిగేందకు ప్రయత్నిస్తారు. ఆరు సంఖ్యలో జన్మించిన అమ్మాయిలు పైకి అందంగా, మృధుస్వభావంగా కనిపించినా... కఠినమైన మనస్తత్వాన్నికలిగి... ఎక్కడ ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పాలో అలానే చెబుతారు. ఏ పనిచేసినా అవసరం మేరకే చేస్తారు తప్పించి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించరు. మూల సంఖ్య ఆరులో జన్మించిన ఆడపిల్లలు క్రీడల్లో, రాజకీయాల్లో రాణించే అవకాశాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  

Tags:    

Similar News