Viral Video: ఏటీఎం అనుకొని వెళ్తే.. షాక్! లోపల ఏముందో చూస్తే నవ్వాపుకోలేరు...

Viral Video: బీహార్‌లోని దానాపూర్‌లో ఒక ఎస్బీఐ ఏటీఎం సెంటర్ ఇప్పుడు సెలూన్‌గా మారిపోయింది. బయట ఏటీఎం బోర్డు చూసి లోపలికి వెళ్తున్న జనం అక్కడ సెలూన్ ఉండటం చూసి అవాక్కవుతున్నారు.

Update: 2026-05-12 05:27 GMT

Viral Video: ఏటీఎం అనుకొని వెళ్తే.. షాక్! లోపల ఏముందో చూస్తే నవ్వాపుకోలేరు...

Viral Video: సోషల్ మీడియా పుణ్యమా అని నిత్యం ఏదో ఒక వింత మన కళ్లముందు నిలుస్తూనే ఉంది. తాజాగా బీహార్‌లోని దానాపూర్ ప్రాంతంలో ఒక ఏటీఎం (ATM) సెంటర్ పరిస్థితిని చూసి నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. బయటి నుంచి చూస్తే అది అచ్చం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎంలాగే కనిపిస్తుంది.. కానీ లోపలికి వెళ్తే మాత్రం సీన్ మొత్తం రివర్స్!

డబ్బులు డ్రా చేసుకుందామని ఏటీఎం లోపలికి వెళ్లే వారికి అక్కడ మెషిన్ కి బదులు సెలూన్ కుర్చీలు, అద్దాలు, కత్తెరలు దర్శనమిస్తున్నాయి. అసలు విషయమేమిటంటే, అక్కడ కొన్ని ఏళ్ల పాటు ఎస్బీఐ ఏటీఎం సెంటర్ ఉండేది. ఇటీవల బ్యాంకు వారు ఆ మెషిన్‌ను తొలగించి ఖాళీ చేశారు. అయితే, ఆ ఖాళీ స్థలంలో ఒక వ్యక్తి తన హెయిర్ సెలూన్‌ను ప్రారంభించాడు.

సెలూన్ యజమాని లోపల షాపు అయితే పెట్టాడు కానీ, బయట ఉన్న ఎస్బీఐ ఏటీఎం బోర్డును మాత్రం అలాగే ఉంచేశాడు. దీంతో దూరం నుంచి చూసేవారికి అది ఏటీఎం సెంటర్ లాగే భ్రమింపజేస్తోంది. తీరా లోపలికి వెళ్ళాక అది సెలూన్ అని తెలిసి జనం అవాక్కవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో "SBI ATM Salon" పేరుతో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

"మెషిన్ లో డబ్బులు లేకపోవడం చూశాం కానీ.. ఏటీఎంలో కటింగ్ చేయడం ఇదే మొదటిసారి" అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.


Tags:    

Similar News