Viral Video: ఎండకు గుడ్డే కాదు.. మనుషులు కూడా 'ఆమ్లెట్' అవ్వాల్సిందే.. వీడియో వైరల్!

Viral Video: ఎంనిప్పుతో పనిలేకుండా కేవలం సూర్యరశ్మితో మిట్ట మధ్యాహ్నం ఆరుబయట ఒక వ్యక్తి ఆమ్లెట్ వేసిన వీడియో.

Update: 2026-06-05 08:48 GMT

Viral Video: ఎండకు గుడ్డే కాదు.. మనుషులు కూడా 'ఆమ్లెట్' అవ్వాల్సిందే.. వీడియో వైరల్!

Viral Video: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ముఖ్యంగా ఒడిశాలో ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందో కళ్లకు కట్టేలా చూపించే ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. స్టవ్, గ్యాస్ లేదా కట్టెల పొయ్యి లాంటి ఎలాంటి నిప్పు లేకుండా కేవలం మిట్ట మధ్యాహ్నం ఎండ వేడితోనే ఒక వ్యక్తి ఆమ్లెట్ వేసిన దృశ్యాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే ఒడిశాకు చెందిన ఒక వ్యక్తి బయట ఎండ ఏ రేంజ్‌లో కొడుతుందో జనాలకు ప్రయోగాత్మకంగా చూపించాలనుకున్నాడు. అందుకోసం ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుని, ఆరుబయట కాలిపోతున్న ఎండలో నేరుగా ఉంచాడు. కొద్దిసేపటికే ఆ ఎండ వేడికి ప్యాన్ బాగా కాలిపోయింది. అనంతరం అందులో కాస్త నూనె వేసి, ఒక కోడిగుడ్డు పగలగొట్టి పోశాడు. ఆశ్చర్యకరంగా, నిప్పు మీద పెట్టినట్లే ఆ గుడ్డు కొద్ది నిమిషాల్లోనే ఉడికిపోయి చక్కటి ఆమ్లెట్‌లా మారిపోయింది.

దీనికి సంబంధించిన విజువల్స్ వీడియో తీసి ఆన్‌లైన్‌లో షేర్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. ఎండలు ఈ స్థాయిలో మండిపోతున్నాయా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎండ వేడికి ఏకంగా ఆమ్లెట్ ఉడికిపోయిందంటే, ఇక రోడ్ల మీద తిరిగే మనుషుల పరిస్థితి ఏంటని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Tags:    

Similar News