Viral Video: అడవిలోని సీసీ కెమెరాలో కనిపించిన వింతైన జంతువు.. అదేంటని చెక్ చేయగా..

Viral Video: మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ కునో జాతీయ ఉద్యానవనంలో దశాబ్దాల విరామం తర్వాత 'కారకల్' అనే అత్యంత అరుదైన అడవి పిల్లి తాజాగా కెమెరా కంటికి చిక్కింది.

Update: 2026-06-06 11:39 GMT

Viral Video: అడవిలోని సీసీ కెమెరాలో కనిపించిన వింతైన జంతువు.. అదేంటని చెక్ చేయగా..

Viral video: దేశంలో ఆఫ్రికన్ చీతాలకు నిలయంగా మారిన మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ ఉద్యానవనం మరోసారి వార్తల్లో నిలిచింది.  ప్రపంచంలో అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణుల జాబితాలో ఉన్న'కారకల్' అనే ఓ అరుదైన అడవి పిల్లి జాడలు తాజాగా కునో అడవుల్లో బయటపడ్డాయి. అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్ సర్వేలో ఈ అరుదైన పిల్లి సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి.

సాధారణ పిల్లులతో పోలిస్తే ఈ అరుదైన అడవి పిల్లి కాస్త భిన్నంగా, పొడవాటి నల్లటి చెవులను కలిగి ఉంటుంది. చాలా అప్రమత్తంగా ఉంటూ, అత్యంత వేగంగా పరిగెత్తగల ఈ కారకల్ పిల్లులు ఎంతో అరుదైనవి. మనుషుల కంట పడకుండా రహస్యంగా జీవించే ఈ పిల్లులు, భారతదేశంలో చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి.

చాలా కాలం తర్వాత ఈ అడవి పిల్లి మళ్లీ కనిపించడం కునో అడవుల్లోని పర్యావరణ సమతుల్యతకు, సుసంపన్నమైన జీవవైవిధ్యానికి ఒక గొప్ప సానుకూల సంకేతమని నిపుణులు భావిస్తున్నారు. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా తీసుకున్న అటవీ సంరక్షణ చర్యల వల్లే, ఇక్కడి పర్యావరణం వన్యప్రాణులకు ఎంత సురక్షితంగా మారిందో చెప్పడానికి ఈ కారకల్ రాక ఒక నిదర్శనమని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

ఈ పరిణామంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఈ అరుదైన కారకల్ ఫొటోను పంచుకుంటూ.. ఇది రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి అని, కునో సుసంపన్నమైన పర్యావరణ వ్యవస్థకు ఇది ఒక గొప్ప నిదర్శనం అని ఆయన కొనియాడారు.




Tags:    

Similar News