Viral Video: చేసింది తప్పుడు పని.. పైగా భర్త పోలీస్ అంటూ వార్నింగ్.! ఈ వీడియో చూస్తే మీరూ తిడతారు

Viral Video: హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Update: 2026-06-06 10:46 GMT

Viral Video: చేసింది తప్పుడు పని.. పైగా భర్త పోలీస్ అంటూ వార్నింగ్.! ఈ వీడియో చూస్తే మీరూ తిడతారు

Viral Video: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తి కాలిపై నుంచి కారు పోనివ్వడమే కాకుండా.. కనీస పశ్చాత్తాపం లేకుండా.. హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారు నడుపుతున్న ఒక మహిళా డ్రైవర్, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి కాలిపై నుంచి కారును పోనిచ్చింది. కనీసం అతడికి ఏమైందో అని చూడకపోగా, పైగా అతడిపైనే ఎదురుదాడికి దిగి "నా భర్త పోలీస్" అంటూ దురుసుగా ప్రవర్తించి బెదిరింపులకు దిగింది.

వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్‌లోని సెక్టార్ 62 వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతుండగా, ఒక కారు అతని కాలిపై నుంచి వెళ్ళింది. డ్రైవింగ్ చేస్తున్న మహిళను అడ్డుకుని అతడు ప్రశ్నించగా, ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.

ఆ మహిళ తన కారు దిగి వచ్చి.. పొరపాటున జరిగిందని క్షమాపణలు చెప్పాల్సింది పోయి, తన భర్త పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉన్నాడంటూ తన అహంకారాన్ని ప్రదర్శించింది. "నా భర్త పోలీస్.. నువ్వు నన్ను ఏమీ చేయలేవు.. ఏం చేసుకుంటావో చేసుకో" అంటూ అతడిని బెదిరించినట్లు ఆ వీడియోలో స్పష్టంగా రికార్డయ్యింది.

ఈ వాగ్వాదానికి సంబంధించిన వీడియోను ఆ వ్యక్తి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. ఆ మహిళ ప్రవర్తన చూసి నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తప్పు చేసి కూడా, అధికార బలుపుతో సామాన్యులను బెదిరించడం ఏంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

భర్త పోలీస్ అయితే చట్టాలు ఆమెకు చుట్టాలు అవుతాయా అని హర్యానా పోలీసు ఉన్నతాధికారులను ట్యాగ్ చేస్తూ నెట్టింట ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురుగ్రామ్ పోలీసులు వెంటనే స్పందించి ఈ వీడియో ఆధారంగా ఆ మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






Tags:    

Similar News