Viral Video: బర్త్ డే కేక్ తిని కడుపునొప్పితో ఏడ్చేసిన చిన్నారి.. ఎక్స్‌రే తీసి చూడగా..

Viral Video: మహారాష్ట్రలోని థానేలో ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మూడేళ్ల చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో తీసుకువచ్చిన కేకులో ఇనుప తీగలు బయటపడ్డాయి.

Update: 2026-06-11 11:57 GMT

Viral Video: బర్త్ డే కేక్ తిని కడుపునొప్పితో ఏడ్చేసిన చిన్నారి.. ఎక్స్‌రే తీసి చూడగా..

Viral Video: పుట్టినరోజు వేడుకలంటే ముందుగా గుర్తొచ్చేది కేక్ కటింగ్. పిల్లల బర్త్‌డేల కోసం రకరకాల ఆకృతుల్లో, డిజైన్లతో ఉండే కేకులను కొనుగోలు చేయడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. అయితే, కేకుల రూపంలో పసిపిల్లల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనడానికి మహారాష్ట్రలోని థానేలో జరిగిన ఈ ఘటనే ఉదాహరణ. మూడేళ్ల చిన్నారి పుట్టినరోజు కోసం తెచ్చిన కేకులో ఏకంగా ఇనుప తీగలు బయటపడటం తల్లిదండ్రులందరినీ ఉలిక్కిపడేలా చేసింది.

అసలేం జరిగిందంటే?

థానేకి చెందిన ఓ కుటుంబం తమ మూడేళ్ల చిన్నారి పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలని భావించి, స్థానికంగా ఉన్న ఒక బేకరీలో అందమైన డిజైన్ ఉన్న కేకును ఆర్డర్ ఇచ్చారు. వేడుకలో కేక్ కట్ చేసిన తర్వాత, చిన్నారికి ఆ కేకును తినిపించారు. అయితే, ఆ కేకును తింటున్న చిన్నారి పొరపాటున అందులో ఉన్న ఒక ఇనుప తీగను మింగేసింది. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు కంగారుగా కేకును నిశితంగా పరిశీలించగా.. కేకు లోపలి భాగంలో దాగి ఉన్న మరికొన్ని ఇనుప తీగలు బయటపడ్డాయి. దీంతో వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ఈ షాకింగ్ ఘటనకు సంబంధించి చిన్నారి తల్లి వెంటనే ఆ కేకును వీడియో రికార్డ్ చేసింది. కేకు లోపల ఇనుప తీగలు ఎలా అమర్చి ఉన్నాయో చూపిస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. సాధారణంగా కేకు డిజైన్‌లు, బొమ్మలు జారిపోకుండా నిలబెట్టడానికి బేకరీ నిర్వాహకులు ఈ తీగలను లేదా టూత్ పిక్‌లను వాడి ఉంటారని భావిస్తున్నారు. కానీ వాటి గురించి కొనుగోలుదారులకు చెప్పకపోవడమే అతిపెద్ద సమస్యగా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు బేకరీ నిర్వాహకుల నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుత కాలంలో 'ఫాండెంట్ కేకులు' లేదా 3D డిజైన్ల కోసం బేకరీల్లో తరచుగా టూత్‌పిక్స్, చెక్క పుల్లలు లేదా ఐరన్ వైర్లు వాడుతుంటారు. కాబట్టి పిల్లలకు కేక్ తినిపించే ముందు తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు లోపల ఏమైనా ప్రాణాంతకమైన వస్తువులు ఉన్నాయో లేదో చేత్తో చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.




Tags:    

Similar News