Viral: ఫస్ట్ రోజు జాబ్‌కు వచ్చిన యువకుడు.. సరిగ్గా 3 గంటల తర్వాత యజమాని చేసిన పనికి!

Viral: ఏదైనా కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు పని నేర్చుకోవడానికి కనీసం కొన్ని రోజుల సమయం పడుతుంది.

Update: 2026-06-12 15:07 GMT

Viral: ఫస్ట్ రోజు జాబ్‌కు వచ్చిన యువకుడు.. సరిగ్గా 3 గంటల తర్వాత యజమాని చేసిన పనికి!

Viral: ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌లో తన మొదటి ఉద్యోగంలో చేరిన ఒక వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. విధుల్లో చేరిన కేవలం మూడు గంటలకే, పనిలో వేగం లేదంటూ యజమాని అతడిని ఉద్యోగం నుంచి తొలగించాడు. ఈ షాకింగ్ ఘటనను సదరు బాధిత యువకుడు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'రెడిట్'లో పంచుకోవడంతో ఇది ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగిందంటే?

బాధితుడు పంచుకున్న వివరాల ప్రకారం.. అతడికి ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి ముందస్తు అనుభవం లేదు. ఇదే అతడి మొదటి ఉద్యోగం, ఈ విషయం ఆ రెస్టారెంట్ యాజమాన్యానికి కూడా ముందే తెలుసు. మొదటి రోజు డ్యూటీకి అతడు ముందుగానే వెళ్లాడు, ఉద్యోగానికి తగ్గట్టుగా డ్రెస్ వేసుకుని సిద్ధమయ్యాడు.

మొదటి గంటలో రద్దీ తక్కువగా ఉండటంతో, బర్గర్లు ఎలా తయారు చేస్తారో చూసి బేసిక్స్ నేర్చుకున్నాడు. కస్టమర్లు రావడం మొదలయ్యాక, కుక్ మీట్ ప్రిపేర్ చేస్తుంటే, ఇతను అందులో కావాల్సిన పదార్థాలు సర్దడం, ఆర్డర్లు అసెంబుల్ చేయడం లాంటివి చేయడం మొదలుపెట్టాడు.

3 గంటల్లోనే ఫైర్:

కొత్త కావడంతో బర్గర్లను వేగంగా, కరెక్ట్‌గా ప్యాక్ చేయడంలో అతడు కాస్త ఇబ్బంది పడ్డాడు. ఇది గమనించిన యజమాని.. పని వేగంగా చేయాలని అతడిని హెచ్చరించాడు. ఆ పనికి, వాతావరణానికి అలవాటు పడటానికి తనకు కాస్త సమయం పడుతుందని ఆ యువకుడు బదులిచ్చాడు. కానీ యజమాని ఏమాత్రం కనికరం చూపలేదు. కేవలం నలుగురు కస్టమర్లకు ఆర్డర్లు ఇచ్చిన తర్వాత, అతడిని పక్కకు పిలిచి "ఈ ఉద్యోగం నీకు సెట్ అవ్వదు" అని చెప్పేశాడు.

అతడిలో బేసిక్ నాలెడ్జ్ లేదని, చూసి నేర్చుకునే 'ఇన్‌స్టింక్ట్' లేదని, వీకెండ్స్‌లో వచ్చే రద్దీని తట్టుకోలేడని చెబుతూ.. ఆ 3 గంటలకు డబ్బులు ఇచ్చేసి ఇంటికి పంపించేశాడు. తనకు కనీసం తప్పులు చేసే అవకాశం, పని నేర్చుకునే సమయం కూడా ఇవ్వకుండా తీసేయడం పట్ల ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ యజమాని తీరుపై మండిపడుతున్నారు.

ఒక కొత్త ఉద్యోగికి పనిపై 'మజిల్ మెమరీ' రావడానికి సమయం పడుతుందని, 3 గంటల్లోనే ఒకరి సామర్థ్యాన్ని అంచనా వేయడం సరికాదని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఎంట్రీ-లెవల్ జాబ్స్‌లో, ఎలాంటి అనుభవం లేని వారిని తీసుకుని, కనీస ట్రైనింగ్ కూడా ఇవ్వకుండా మొదటి రోజు నుంచే యంత్రాల్లాగా పనిచేయాలని యాజమాన్యాలు ఆశించడం కరెక్ట్ కాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Tags:    

Similar News