Viral Video: రాత్రుళ్లు అమ్మాయిలు చేసే ఆర్డర్లే ఎక్కువ.. డెలివరీ బాయ్ చెప్పింది ఇదే.!

Viral Video: అర్ధరాత్రి పూట ఎవరెవరు ఏమేం ఆర్డర్ చేస్తారు? ముఖ్యంగా అమ్మాయిలు అర్ధరాత్రి ఎలాంటి స్నాక్స్ తెప్పించుకుంటారు.?

Update: 2026-05-30 12:39 GMT

Viral Video: రాత్రుళ్లు అమ్మాయిలు చేసే ఆర్డర్లే ఎక్కువ.. డెలివరీ బాయ్ చెప్పింది ఇదే.!

Viral Video: అర్ధరాత్రి 12 లేదా ఒంటిగంట దాటుతోంది. ఇల్లంతా చాలా సైలెంట్‌గా ఉంటుంది. కానీ మన కడుపులో మాత్రం అకస్మాత్తుగా ఏదో తినాలని ఓ చిన్న కోరిక మొదలవుతుంది. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చీకట్లో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వెతకడమో, లేదా సైలెంట్‌గా మొబైల్ యాప్ ఓపెన్ చేసి చిప్స్, చాక్లెట్స్ ఆర్డర్ పెట్టడమో మనలో చాలామంది చేసే పనే! అయితే, మనం సీక్రెట్‌గా చేసే ఈ పనుల వెనక, ఫుడ్ తీసుకొచ్చే డెలివరీ బాయ్స్‌కు ఎంత ఫన్ ఉంటుందో మీరెప్పుడైనా ఊహించారా?

రీసెంట్‌గా ఒక జెప్టో డెలివరీ ఏజెంట్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాత్రి పూట షిఫ్ట్‌లో డెలివరీ చేసేటప్పుడు అతనికి ఎదురయ్యే ఫన్నీ అనుభవాలను, కస్టమర్ల అలవాట్లను అందరితో పంచుకున్నాడు. అతను చెప్పిన దాని ప్రకారం.. "రాత్రి పూట నేను డెలివరీ చేసే ఆర్డర్స్‌లో ఎక్కువ శాతం కేవలం అమ్మాయిలవే ఉంటాయి. ఆర్డర్ పికప్ చేయగానే వెంటనే వాళ్ల నుంచి ఫోన్‌కు ఒక ముందస్తు ఇన్స్ట్రక్షన్ వస్తుంది. 'అన్నా.. ఇంటికి రాగానే నాకు కాల్ చేయి, దయచేసి డోర్ బెల్ మాత్రం అసలు కొట్టొద్దు' అని చెబుతుంటారు" అంటూ నవ్వుతూ అసలు సీక్రెట్ బయటపెట్టాడు.

ఇంతకీ వాళ్ళు అంత అర్ధరాత్రి తెప్పించుకుని తినేది బిర్యానీలో, పిజ్జాలో కాదు.. కేవలం చిప్స్, వేఫర్స్, చాక్లెట్స్, మ్యాగీ లాంటివి మాత్రమే. అచ్చం చిన్నపిల్లలు ఇష్టపడి తినే స్నాక్స్ అన్నమాట. "అసలు రాత్రి పూట ఎవరైనా ఇవి తింటారా భయ్యా? అదీ ఎవరికీ తెలియకుండా బెల్ కొట్టొద్దని దొంగతనంగా తెప్పించుకుంటారు. బహుశా పగలు ప్రశాంతంగా తినడానికి వీళ్లకు టైం దొరకదేమో" అని ఆ డెలివరీ బాయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఈ వీడియోకి సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. కొందరు అమ్మాయిలు "సారీ భయ్యా, మా సీక్రెట్స్ ఇలా బయటపెట్టి పరువు తీయకండి" అంటే, మరికొందరు "అదే మా 'మీల్ టైమ్' భయ్యా, ఆ టైంలోనే మాకు నిజమైన ప్రశాంతత దొరుకుతుంది" అంటూ రిప్లై ఇస్తున్నారు.


Tags:    

Similar News