Prisoner: శోభనం గదిలోకి కూడా బేడీలతోనేనా?.. వైరల్ అవుతున్న ఖైదీ పెళ్లి ఫోటోలు

ప్రేమించిన వాడు జైలులో ఉన్నా పట్టుపట్టి మరీ పెళ్లి చేసుకున్న ఒక యువతి కథ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Update: 2026-05-14 03:54 GMT

Prisoner: శోభనం గదిలోకి కూడా బేడీలతోనేనా?.. వైరల్ అవుతున్న ఖైదీ పెళ్లి ఫోటోలు

Love Behind Bars: ప్రేమ గుడ్డిది అంటారు కానీ, నిజానికి ప్రేమకు అంతులేని ధైర్యం ఉంటుందని ఈ సంఘటన నిరూపిస్తోంది. కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసేది కాదు.. కన్నీళ్లలో తోడుండేదే నిజమైన ప్రేమ అని చాటిచెప్పిన ఒక యువతి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. వరుడి చేతులకు బేడీలు ఉన్నా, చుట్టూ పోలీసులు పహారా కాస్తున్నా.. తనవాడినే పెళ్లాడి ఆ ముడి వేయించుకున్న ఆ వధువు తెగువకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

తాను ప్రేమించిన యువకుడు ఒక కేసులో చిక్కుకుని జైలు పాలయ్యాడు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా వెనకడుగు వేస్తారు. కానీ, ఆ యువతి మాత్రం వెనక్కి తగ్గలేదు. అతడు ఎక్కడున్నా, ఎలా ఉన్నా.. నా జీవితం అతడితోనే అని పట్టుపట్టి మరీ ఇరు కుటుంబాలను ఒప్పించింది. దీంతో ఆ యువకుడు పెళ్లి కోసం కోర్టు నుండి పెరోల్ పొంది బయటకు వచ్చాడు.

చేతులకు బేడీలు..

పెళ్లి వేడుక అంటే చుట్టూ బంధుమిత్రులు, సందడి ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం పోలీసుల పహారా మధ్య పెళ్లి జరిగింది. కోర్టు నిబంధనల ప్రకారం వరుడిని పెరోల్ మీద తీసుకువచ్చిన పోలీసులు, భద్రతా కారణాల దృష్ట్యా అతడి చేతులకు తాళ్లు కట్టి, బేడీలు వేసి ఉంచారు. ఆ బంధనాలతోనే వరుడు జీలకర్ర బెల్లం పెట్టడం, మంగళసూత్రం కట్టడం వంటి పద్ధతులన్నీ పూర్తి చేశాడు. తన ప్రియుడి చేతికి తాళ్లు ఉన్నా, చుట్టూ తుపాకులు పట్టుకున్న పోలీసులు ఉన్నా.. ఆ వధువు మాత్రం ఎంతో సంతోషంగా ఆ బంధంలోకి అడుగుపెట్టింది.

ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలోకి రావడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు ఆ వధువు ప్రేమను మెచ్చుకుంటుంటే, మరికొందరు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. కోర్టు పర్మిషన్ ఇచ్చాక కూడా పెళ్లి పీటల మీద అలా తాళ్లతో కట్టి ఉంచడం ఏంటి? ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే అని కొందరు సీరియస్ అవుతున్నారు. ఇక మరికొందరు ఫన్నీగా స్పందిస్తూ.. పాపం, చివరకి శోభనం గదిలోకి కూడా పోలీసులు అలా తాళ్లతో కట్టే తీసుకువెళ్తారా ఏంటి? అంటూ జోకులు పేలుస్తున్నారు. నిజమైన ప్రేమకు సంకెళ్లు కూడా అడ్డుకావని ఈ జంట నిరూపించింది అని మరికొందరు ప్రశంసిస్తున్నారు. ఏది ఏమైనా, సినిమాల్లో కూడా కనిపించని ఈ అరుదైన దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. నిబంధనల మధ్య జరిగిన ఈ పెళ్లి, ఆ వధువు మొండి పట్టుదల ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

Tags:    

Similar News