Viral Video : ఆవు కోసం బైకర్ సాహసం.. వీడియో చూస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..!

Viral Video : బిజీగా ఉండే రోడ్లపై పశువులు అడ్డువస్తే హారన్లు కొడుతూ విసుక్కునే వాహనదారులను తరచూ చూస్తుంటాం. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ఒక బైకర్..

Update: 2026-08-22 11:25 GMT

Biker-Viral-Video

Viral Video : బిజీగా ఉండే రోడ్లపై పశువులు అడ్డువస్తే హారన్లు కొడుతూ విసుక్కునే వాహనదారులను తరచూ చూస్తుంటాం. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ఒక బైకర్ మాత్రం అందరి కంటే భిన్నంగా ఆలోచించాడు. బిజీగా ఉన్న ఫ్లైఓవర్‌పై రాకపోకల మధ్య చిక్కుకుని భయపడిపోతున్న ఒక ఆవును చూసి చలించిపోయాడు. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి, ఆవును క్షేమంగా సురక్షిత ప్రాంతానికి చేర్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

స్పీడుగా వెళ్లే వాహనాల మధ్య ఊహించని ప్రమాదం..

ఘాజియాబాద్‌లోని ఒక ఫ్లైఓవర్‌పై వాహనాలు అత్యంత వేగంగా వెళ్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో ఒక ఆవు ఫ్లైఓవర్ మధ్యలోకి వచ్చి చిక్కుకుపోయింది. ఇరువైపులా వేగంగా దూసుకొస్తున్న కార్లు, లారీల ధాటికి ఆ పశువు ఎటు వెళ్లాలో తెలియక భయంతో అక్కడే ఉండిపోయింది. ఏ క్షణంలో ఏ వాహనం ఢీకొడుతుందో అనిపిస్తున్న ఆ విపత్కర పరిస్థితుల్లో, ఆ మార్గంలో వెళ్తున్న ఒక బైకర్ వెంటనే స్పందించాడు.

ప్రాణాలకు తెగించి ఆవును కాపాడిన బైకర్

ఆవును కాపాడటానికి ఆ బైకర్ తన బైక్‌ను ఆవు పక్కనే నెమ్మదిగా నడుపుతూ రక్షణగా నిలిచాడు. వెనుక నుంచి వస్తున్న వాహనదారులు ఆవును ఢీకొట్టకుండా జాగ్రత్తపడుతూ, ఆవుకు ఎలాంటి హాని జరగకుండా రోడ్డు పక్కకు మెల్లగా దారి తీశాడు. తనను వాహనాలు ఢీకొట్టే ప్రమాదం ఉన్నప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా, ఆవును ఫ్లైఓవర్ దాటించి సురక్షిత ప్రాంతానికి చేర్చే వరకు దాని వెంట నీడలా నడిచాడు.

సోషల్ మీడియాలో వైరల్.. వీడియో తీసిన నెటిజన్

శ్రీ సుధ్ (Shri Sudh) అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ బైకర్ ఎలాంటి ప్రతిఫలం లేదా ప్రశంసలు ఆశించకుండా నిశ్శబ్దంగా చేసిన సహాయం అందరికీ ఆదర్శమని వ్యాఖ్యానించాడు. "ఎవరూ పొగడ్తలు అడగరు, కానీ మంచి పనులు మానవత్వానికి నిదర్శనం" అని క్యాప్షన్ జోడించి ఆయన ఆ బైకర్‌పై ప్రశంసలు కురిపించాడు.

"దేవుడి రూపంలో వచ్చిన మనిషి" – నెటిజన్ల కంప్లిమెంట్స్

ఈ వీడియో నెట్టింట ప్రత్యక్షమవ్వగానే నెటిజన్లు ఆ బైకర్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. బిజీ ట్రాఫిక్‌లో మూగజీవి కోసం అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం సామాన్యమైన విషయం కాదని కొనియాడుతున్నారు. "మానవత్వం ఇంకా బతికే ఉందనడానికి ఇదే నిదర్శనం" అని కొందరు కామెంట్ చేయగా, మరికొందరు "సహాయం చేయడానికి మనసు ఉండాలే కానీ, అది రూపం లేకుండా దేవుడిలా వచ్చి చేరుతుంది" అంటూ ఆ బైకర్ ధైర్యాన్ని, హ్యామానిటీని ముక్తకంఠంతో మెచ్చుకుంటున్నారు.



Full View

Tags:    

Similar News