Viral News : ఇదేం బిల్లు రా బాబోయ్.. అమెజాన్ దెబ్బకు 125 లక్షల కోట్ల కరెంట్ బిల్లు..

Viral News : పొద్దున్నే లేచి కాఫీ తాగుతూ కరెంట్ బిల్లో, ఫోన్ బిల్లో చెక్ చేసుకుంటే ఒక వంద రూపాయలు ఎక్కువ వస్తేనే మనకు దిమ్మతిరిగిపోతుంది. అలాంటిది అకౌంట్

Update: 2026-07-20 11:34 GMT

amazon

Viral News : పొద్దున్నే లేచి కాఫీ తాగుతూ కరెంట్ బిల్లో, ఫోన్ బిల్లో చెక్ చేసుకుంటే ఒక వంద రూపాయలు ఎక్కువ వస్తేనే మనకు దిమ్మతిరిగిపోతుంది. అలాంటిది అకౌంట్ ఓపెన్ చేయగానే రూ.125 లక్షల కోట్లు ($1.5 ట్రిలియన్ డాలర్లు) కట్టాలని కనిపిస్తే? ఇంకేముంది... ఉన్నపళంగా కళ్ళు తిరిగి పడిపోవడమే తక్కువ.. సరిగ్గా ఇలాంటి ఓ మైండ్ బ్లాకింగ్ ఎక్స్‌పీరియన్స్ మన దేశానికి చెందిన ఓ ఐటీ బాబుకి ఎదురైంది. అయితే ఈ సువర్ణ అవకాశం ఒక్కడికే దక్కలేదు, గ్లోబల్ గ్లిచ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఏడబ్ల్యూఎస్ (AWS) కస్టమర్ల గుండెలను అమెజాన్ భలేగా పిండేసింది.

నా ఆత్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది.!

మన దేశానికి చెందిన భరత్ అనే డెవలపర్ అలవాటు ప్రకారం తన అమెజాన్ వెబ్ సర్వీసెస్ అకౌంట్ ఓపెన్ చేశాడు. అక్కడ నెల బిల్లు అంచనా దగ్గర ఒక పెద్ద సంఖ్య కనిపించింది... అదే 1,499,659,180,107 డాలర్లు అని.. అయితే.. ఆ ఇంతపెద్ద సంఖ్య లెక్కపెట్టేలోపే ఆయన మైండ్ బ్లాంక్ అయిపోయింది. వెంటనే ఆ స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, నా ఏడబ్ల్యూఎస్ బిల్లుపై $1.5 ట్రిలియన్లు చూడగానే నా ఆత్మ నన్ను వదిలేసి పోయినంత పనైంది అని గుండెలు బాదుకున్నాడు. ఆయన వాడిన క్లౌడ్ డేటాలో ఎలాంటి మార్పు లేదు కానీ, బిల్లు మాత్రం ఏకంగా 744,728,201,771 శాతం పెరిగి కూర్చుంది.

'గుండెపోటు'కి గుడ్ మార్నింగ్..

ఈ బిల్లుల తుఫాను ఒక్క భరత్ ఇంటితో ఆగలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్లు, చిన్న చిన్న కంపెనీలు, విద్యార్థులు కూడా ఈ షాక్ తిన్నారు. ఢిల్లీకి చెందిన సచిన్ అనే కుర్రాడు నెలకు రూ.100 కంటే తక్కువే బిల్లు కడతాడు, అలాంటిది ఈసారి ఏకంగా $10.9 బిలియన్లు కట్టాలంటూ అతనికి బిల్లు దర్శనమిచ్చింది. అలాగే యూకేకి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ నెలకు రూ.36 ఖర్చయ్యే ఒక చిన్న యాప్ వాడుతుంటే, వారికి ఏకంగా $7.8 బిలియన్ల బిల్లు మెసేజ్ వచ్చింది. ఇంకొందరికైతే ఏకంగా $7 ట్రిలియన్లకు పైగా బిల్లులు రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఉదయాన్నే గుండెపోటు అనుభవాన్ని ఆస్వాదిస్తున్న అందరికీ గుడ్ మార్నింగ్ అంటూ మీమ్స్‌తో రచ్చ రచ్చ చేశారు.

మా వైపు చిన్న పొరపాటు జరిగింది సర్..!

ఈ లగ్జరీ బిల్లుల రచ్చ బాగా ఎక్కువవడంతో చివరికి అమెజాన్ బయటకొచ్చింది. బిల్లింగ్ సిస్టమ్‌లో ఒక తప్పుడు కాన్ఫిగరేషన్ వల్ల యూనిట్ కన్వర్షన్ డేటా మారకపోవడంతో ఈ భారీ లెక్కల తప్పు జరిగిందని, ఇది కేవలం అంచనా వ్యయం మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. నిజమైన ఇన్వాయిస్‌లలో ఎలాంటి మార్పూ లేదని, కస్టమర్ల జేబులకేం చిల్లు పడలేదని స్పష్టం చేసింది. అయితే ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ టీమ్ స్పందిస్తూ, మా వైపు నుంచి ఒక చిన్న లెక్క తప్పు జరిగింది (చాలా చిన్నది లేండి) అంటూ సరదాగా కామెంట్ చేసింది. మొత్తానికి కస్టమర్ల ప్రాణాలను అరచేతిలో పెట్టేసి, అమెజాన్ తన క్లౌడ్ సర్వీస్‌లో ఒక భయానక కామెడీ షో నడిపేశాడన్నమాట...

Tags:    

Similar News