అవును.. పెళ్లికి ముందు నేను ‘బైసెక్సువల్’.. హీరోయిన్ షాకింగ్ స్టేట్‌మెంట్
బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న ‘సచ్ యా సజా’ రియాలిటీ షోలో ఊహించని హైడ్రామా నడిచింది. సాధారణంగా సెలబ్రిటీలు తమ పర్సనల్ లైఫ్‌ను చాలా సీక్రెట్‌గా
బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న ‘సచ్ యా సజా’ రియాలిటీ షోలో ఊహించని హైడ్రామా నడిచింది. సాధారణంగా సెలబ్రిటీలు తమ పర్సనల్ లైఫ్‌ను చాలా సీక్రెట్‌గా ఉంచుతారు. కానీ ఈ షోలో ఒక కంటెస్టెంట్ చేసిన పనికి.. పాపులర్ నటి ఆకాంక్ష చమోలా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అత్యంత రహస్యమైన విషయాన్ని కెమెరాల ముందే ఒప్పుకోవాల్సి వచ్చింది.
ఫ్రెండే కదా అని చెప్తే.. కొంపముంచారు
అసలు మ్యాటర్ ఏంటంటే.. షో స్టార్ట్ అవ్వడానికి ముందు బ్యాక్‌స్టేజ్‌లో ఆకాంక్ష తన పర్సనల్ లైఫ్ గురించి ఎవరితోనో మాట్లాడుకున్నారు. అయితే అక్కడే ఉన్న తోటి కంటెస్టెంట్ శ్రేయా కల్రా ఆ మాటలను దొంగచాటుగా వినేశారు. అంతటితో ఆగకుండా ఆ సీక్రెట్‌ను తీసుకెళ్లి మరో కంటెస్టెంట్ సూఫీ మోతీవాలాకు చెప్పేశారు. దీంతో ఆకాంక్ష గేమ్‌లో ఒక లైఫ్‌లైన్‌ను కోల్పోవడమే కాకుండా, తన పరువు బజార్న పడిందని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
అవును.. పెళ్లికి ముందు నేను ‘బైసెక్సువల్’
తన పర్సనల్ మ్యాటర్‌ను ఇలా లీక్ చేయడంతో ఆకాంక్ష స్టేజ్ మీదే ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ తన గతాన్ని తానే ఓపెన్‌గా ఒప్పుకున్నారు. నటుడు గౌరవ్ ఖన్నాతో పెళ్లికంటే ముందు తనకు అమ్మాయిల పట్ల ఆకర్షణ ఉండేదని, కొందరు అమ్మాయిలతో రిలేషన్‌లో కూడా ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. అది తన జీవితంలోనే అత్యంత వీక్ మూమెంట్ అని చెప్పారు. సమాజం ఎలాంటి ముద్రలు వేసినా.. తనకు మాత్రం ఆడవాళ్లంటే అమితమైన గౌరవం, స్వచ్ఛమైన ప్రేమ అని భావోద్వేగంతో మాట్లాడారు.
స్టేజ్‌పైకి వచ్చి ఓదార్చిన ఫరా ఖాన్
ఈ రియాలిటీ షోలోకి వచ్చాక తన ప్రైవసీ పూర్తిగా పోయిందని, అసలు ఈ షోకి రావడం కరెక్టేనా అంటూ ఆకాంక్ష వెక్కివెక్కి ఏడ్చారు. ఆమె బాధను చూసి జడ్జ్ సీట్లో ఉన్న బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ ఫరా ఖాన్ వెంటనే స్టేజ్ పైకి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆకాంక్షను గట్టిగా కౌగిలించుకుని, ధైర్యం చెబుతూ ఓదార్చారు.
ఆకాంక్ష బ్యాక్‌గ్రౌండ్ ఇదీ..
బుల్లితెరపై ‘సంతోషి మా’, ‘యే హై ఆషికి’, ‘క్రైమ్ పెట్రోల్’ లాంటి సూపర్ హిట్ షోలతో ఆకాంక్ష మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఒక ఆడిషన్‌లో పరిచయమైన నటుడు గౌరవ్ ఖన్నాతో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ నవంబర్ 2016లో కాన్పూర్‌లో గ్రాండ్‌గా పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. ప్రస్తుతానికి ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.