Wife Marries Boyfriend: కుక్కర్‌లో బలి కాకుండా బ్రతికిపోయాడు

Wife Marries Boyfriend: ఉత్తర ప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్‌లో విచిత్ర సంఘటన.

Update: 2026-08-09 07:55 GMT

Wife Marries Boyfriend: కుక్కర్‌లో బలి కాకుండా బ్రతికిపోయాడు

Viral Marriage: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య... 21 ఏళ్ల సుదీర్ఘ దాంపత్య బంధం... ఐదుగురు పిల్లలు. అయినా ఆ భార్య మనసు వేరే యువకుడిపై మళ్లింది. దీంతో ఆ భర్త ఆగ్రహంతో ఊగిపోలేదు, కక్ష పెంచుకోలేదు. పైగా తానే దగ్గరుండి భార్యకు ఆమె ప్రియుడితో అధికారికంగా పెళ్లి జరిపించి సాగనంపాడు. ఉత్తర ప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ విచిత్రమైన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

సంత్ కబీర్ నగర్‌కు చెందిన సదరు దంపతులు 21 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఇన్నాళ్లూ సాఫీగానే సాగిన వీరి కుటుంబంలోకి ఊహించని మలుపు వచ్చింది. రెండు నెలల క్రితం ఆ మహిళ తనకంటే 13 ఏళ్లు చిన్నవాడైన, అదే గ్రామానికి చెందిన ఒక యువకుడితో ప్రేమలో పడి అతనితో కలిసి వెళ్లిపోయింది. ఇటీవల ఆమె తిరిగి గ్రామానికి రాగా, ఇంట్లో దంపతుల మధ్య తీవ్ర వివాదం నెలకొంది.

ఎంత నచ్చజెప్పినా భార్య మనసు మారకపోవడం, ప్రియుడితోనే ఉంటానని స్పష్టంగా చెప్పడంతో ఆ భర్త సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గొడవలు పడి జీవితాన్ని నరకం చేసుకోవడం కంటే, ఆమె కోరుకున్న జీవితాన్ని ఇవ్వడమే మేలని భావించాడు.ఇరువైపుల కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలను ఒప్పించిన భర్త... అందరి సమక్షంలోనే తన భార్యకు, ఆమె ప్రియుడికి వేద మంత్రాల నడుమ అధికారికంగా పెళ్లి జరిపించాడు. వివాహం పూర్తయిన తర్వాత ఆ కొత్త దంపతులను సంతోషంగా ఆశీర్వదించి సాగనంపాడు.

ఈ పెళ్లికి సంబంధించిన దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు నెటిజన్లు ఆ భర్త చూపిన గుండె ధైర్యానికి, ఉదారతకు అభినందనలు తెలుపుతుంటే...మరికొందరు 21 ఏళ్ల బంధాన్ని, ఐదుగురు పిల్లల భవిష్యత్తును గాలికి వదిలేసి వెళ్లడం సరికాదు అని భార్య తీరును తప్పుబడుతున్నారు. ఏది ఏమైనా, క్షణికావేశంలో ప్రాణాలు తీసే నేరాలు పెరుగుతున్న ఈ రోజుల్లో... భర్త తీసుకున్న ఈ నిర్ణయం విస్మయాన్ని, విచిత్రమైన చర్చను రేకెత్తిస్తోంది.


Full View


Tags:    

Similar News