Cherial: చేర్యాలలో వివాహ విందు హాజరైన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి!

Cherial: చేర్యాలలో నిర్వహించిన మాజీ ఎంపీపీ భావండ్ల నాగజ్యోతి-కృష్ణంరాజు కుమారుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పల్లా.

Update: 2026-08-24 12:11 GMT

Cherial: చేర్యాలలో వివాహ విందు హాజరైన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి!

Cherial: సిద్ధిపేట జిల్లా, చేర్యాలలో బచ్చన్నపేట మండలానికి చెందిన మాజీ ఎంపీపీ భావండ్ల నాగజ్యోతి, కృష్ణంరాజు గారి కుమారుడు సాయి మనోజ్, సుగంధికల వివాహ రిసెప్షన్ వేడుక సందడిగా జరిగింది. చేర్యాల పట్టణంలోని భద్రకాళి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ఈ వివాహ విందు కార్యక్రమానికి జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ప్రత్యేకంగా హాజరయ్యారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు నూతన వధూవరులైన సాయి మనోజ్, సుగంధికలను ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో, సంతాన సౌభాగ్యంతో నిండి ఉండాలని శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులకు అందరూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News