Cherial: మేజర్ గ్రామపంచాయతీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Cherial: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూర్ మేజర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ కొమ్ము రవి ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం.

Update: 2026-08-24 09:35 GMT

Cherial: మేజర్ గ్రామపంచాయతీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

చేర్యాల: చేర్యాల మండలం ఆకునూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సోమవారం గ్రామ సచివాలయం లో జరిగింది.

గ్రామ సర్పంచ్ కొమ్మురవి గ్రామ వార్డు సభ్యులు ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు రేషన్ సరుకులు మరింత సులభతరంగా పాదదర్శకంగా జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.

గ్రామంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల.ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా స్మార్ట్ కార్డులు అందుకున్న స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తూ గ్రామపంచాయతీ పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు

Tags:    

Similar News