Rampachodavaram: రంపచోడవరం ఆసుపత్రిలో గర్భిణీలకు పండ్ల పంపిణీ!

Rampachodavaram: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు వేదాగ్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్లను పంపిణీ చేశారు.

Update: 2026-08-19 03:03 GMT

Rampachodavaram: రంపచోడవరం ఆసుపత్రిలో గర్భిణీలకు పండ్ల పంపిణీ!

Rampachodavaram: రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో గర్భిణీలకు వేదాగ్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ వేదాగ్ని ట్రస్ట్ అధినేత మంజు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పోలవరం జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ మహిళలకు పండ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గర్భిణీల ఆరోగ్యం, పోషకాహారం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, వారికి పండ్లు అందజేశారు. సమాజ సేవే లక్ష్యంగా వేదాగ్ని ట్రస్ట్ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వేదాగ్ని ట్రస్ట్ ఇంచార్జి చిన్నం టోనీ బాబు, చిన్నం కుమారి, పోలేపల్లి లక్ష్మి, సుంకరి దుర్గారెడ్డి, కారం నరసింహ (నాని), ఎస్. రామకృష్ణ, గొర్లె వాహిని తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags:    

Similar News