Konaseema: కోనసీమ కొబ్బరి రైతులకు ఆర్ అండ్ ఆర్ పథకం వర్తింపజేయాలి!

Konaseema: కోనసీమ కొబ్బరి రైతుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. దిగుబడి పెంచేందుకు R&R పథకాన్ని విస్తృతంగా అమలు చేయాలని వినతి.

Update: 2026-08-18 12:02 GMT

Konaseema: కోనసీమ కొబ్బరి రైతులకు ఆర్ అండ్ ఆర్ పథకం వర్తింపజేయాలి!

Konaseema: డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కొబ్బరి తోటలలో తగ్గుతున్న ఉత్పాదకతపై పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ అసెంబ్లీలో ప్రస్తావించారు.

కోనసీమ జిల్లాలో సుమారు 1.07 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతూ, రాష్ట్రంలోనే ప్రముఖ కొబ్బరి ఉత్పత్తి ప్రాంతంగా గుర్తింపు పొందింది. అయితే పాతబడిన తోటలు, రోగాలు–కీటకాల ప్రభావం, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, తోటల నిర్వహణ లోపాలు తదితర కారణాలతో కొబ్బరి దిగుబడులు తగ్గుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ నేపథ్యంలో కొబ్బరి అభివృద్ధి బోర్డు అమలు చేస్తున్న Replanting & Rejuvenation (R&R) Schemeను కోనసీమ జిల్లాలో విస్తృత స్థాయిలో అమలు చేయాలని కోరారు.

పాత, రోగగ్రస్త మరియు తక్కువ దిగుబడి ఇచ్చే చెట్లను తొలగించేందుకు చెట్టుకు ₹1,000 వరకు, హెక్టారుకు గరిష్టంగా ₹32,000 వరకు సహాయం, తొలగించిన చెట్ల స్థానంలో నాణ్యమైన కొబ్బరి మొక్కలను నాటేందుకు మొక్కకు ₹45, హెక్టారుకు గరిష్టంగా ₹4,500 వరకు సబ్సిడీ అందించే విధానాన్ని రైతులకు విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

అదేవిధంగా ప్రస్తుత కొబ్బరి తోటల పునరుద్ధరణకు సమతుల్య ఎరువుల వినియోగం, నీటి నిర్వహణ, మట్టిసంరక్షణ, సేంద్రీయ ఎరువులు, కీటకాలు–వ్యాధుల సమగ్ర నియంత్రణ వంటి Integrated Management Practices అమలు చేయాలని, ఇందుకోసం హెక్టారుకు ₹17,500 వరకు ఆర్థిక సహాయం అందించే విధానాన్ని మరింత విస్తరించాలని ఎమ్మెల్యే కోరారు.

కోనసీమ కొబ్బరి రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని R&R పథకాన్ని ప్రత్యేక దృష్టితో అమలు చేస్తే పాత తోటలు పునరుజ్జీవనం పొంది, కొబ్బరి ఉత్పాదకత పెరగడంతో పాటు రైతుల ఆదాయం కూడా మెరుగుపడుతుందని గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు.

కొబ్బరి రైతులకు ప్రభుత్వం, కొబ్బరి అభివృద్ధి బోర్డు ద్వారా అవసరమైన సాంకేతిక సహాయం, ఆర్థిక ప్రోత్సాహకాలు అందించి, అర్హులైన ప్రతి రైతుకు పథకం ప్రయోజనాలు చేరేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు.

Tags:    

Similar News