Sakhinetipalli: ఉయ్యూరివారి మెరకలో 'రెండేళ్ల నమ్మకం'.. డోర్ టు డోర్ చేపట్టిన అమూల్య!
Sakhinetipalli: సఖినేటిపల్లి మండలం ఉయ్యూరివారి మెరకలో టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమం. పాల్గొన్న గొల్లపల్లి అమూల్య.
Sakhinetipalli: ఉయ్యూరివారి మెరకలో 'రెండేళ్ల నమ్మకం'.. డోర్ టు డోర్ చేపట్టిన అమూల్య!
Sakhinetipalli: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం, ఉయ్యూరివారి మెరక గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమూల్య గ్రామంలోని పలు ఇళ్లను సందర్శించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను వివరించడంతో పాటు, ప్రజల నుంచి వచ్చిన వినతులను ఆమె శ్రద్ధగా ఆలకించారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని అమూల్య హామీ ఇచ్చారు. డోర్ టు డోర్ కార్యక్రమానికి ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు పెచ్చెట్టి బాబు, మండల పార్టీ అధ్యక్షులు తాడి సత్యనారాయణ, మండల పార్టీ ఉపాధ్యక్షులు చెల్లుబోయిన నాగబాబు, మండల బీసీ సెల్ అధ్యక్షులు కొల్లు మహాలక్ష్మి, గ్రామశాఖ అధ్యక్షుడు చెల్లుబోయిన జయ సూరిబాబు, చేనేత సాధికార సభ్యులు కొండ శివయ్య, జనసేన నాయకులు తోట ప్రసాద్, ఓదూరి రాజా, క్లస్టర్ తాడి రాము, బూత్ కన్వీనర్ ఉయ్యూరి హరిప్రసాద్ రాజు, మండల TNCU అధ్యక్షులు పాటి వెంకటేశ్వరావు, బూత్ కన్వీనర్లు జిల్లెళ్ల పావెల్ రెడ్డి, తాడి రవీంద్ర తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.