Amalapuram: తాగునీటి భూమిని టీడీపీకి కేటాయించడంపై విసీకే తీవ్ర నిరసన
Amalapuram: ప్రజల తాగునీటి అవసరాల భూమిని అధికార టీడీపీ కార్యాలయానికి కేటాయించడం ప్రజా ద్రోహమని విరుతుటైగల్ కచ్చి (VCK) రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బొంతు రమణ మండిపడ్డారు.
Amalapuram: తాగునీటి భూమిని టీడీపీకి కేటాయించడంపై విసీకే తీవ్ర నిరసన
అమలాపురం: అమలాపురంలో తాగునీటి భూములను టీడీపీకి కేటాయించడం ప్రజా ద్రోహమే (VCK) పార్టీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బొంతు రమణ. అమలాపురం ప్రజల భవిష్యత్ తాగునీటి అవసరాల కోసం గతంలో మున్సిపాలిటీ కొనుగోలు చేసిన విలువైన స్థలాన్ని,అధికార టీడీపీ కార్యాలయానికి దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేందుకు మున్సిపల్ కమిషనర్
అక్కడ మిగులు ఉన్న స్థలాన్ని ఉపయోగించడం లేదు"అని ఇవ్వడం వలనపార్టీ ఆఫీసుకు భూమికి ఎటాయించడం జరిగిందని విడుదలై చిరుతైగల్ కచ్చి (VCK) పార్టీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బొంతు రమణ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ తాగునీటి భూమిపై కమిషనర్ మిగులు స్థలాన్ని ఉపయోగించడం లేదు"అని ఎలా చెబుతారని ప్రశ్నించారు.గతంలో ప్రజల తాగునీటి అవసరాల కోసం మున్సిపాలిటీ స్వయంగా కొనుగోలు చేసిన భూమిని,ఇప్పుడు "మిగులు భూమి"గా వర్గీకరిస్తూ ప్రజల నిధులతో కొన్న ఆస్తిని ఒక రాజకీయ పార్టీకి ధారాదత్తం చేయడం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమేనని ఆయన అన్నారు.
ఒక ప్రక్క జిల్లా ఆఫీసులకు స్థలాలు లేవు పార్టీ ఆఫీస్‌కు ఏకంగా 2 ఎకరాలా భూమ అని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏర్పడి ఇన్ని ఏళ్లవుతున్నా, ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు నిర్మించుకోవడానికి స్థలాలు కొనుగోలు చేయలేని ప్రభుత్వం, అధికార పార్టీ కార్యాలయానికి మాత్రం కోట్లాది రూపాయల విలువైన 2 ఎకరాల భూమిని కేటాయించడం ఏ రకమైన న్యాయం అనీ దీనిపై న్యాయపోరాటం కూడా వెనకాడమని ఆయన పేర్కొన్నారు.ఈ జిల్లాలో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ దళిత,గిరిజన సంక్షేమం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోందనీ,
హాస్టళ్ల దుస్థితి చెప్పనక్కర్లేదని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇప్పటివరకు సొంత కళాశాల హాస్టల్ భవనాలు కేటాయించ పొగా,ఇతర జిల్లాల్లో ఉన్నట్లుగా,జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఎస్సీ,ఎస్టీ యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు తగ్గిన ఉచిత 'స్టడీ సర్కిల్' కూడా ఏర్పాటు చేయలేదనీ రమణ ఆయన మండిపడ్డారు.
ప్రజావసరాలను,విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేసి,పార్టీ ఆఫీసులకు భూములు కేటాయించడం ప్రజాస్వామ్య వ్యవస్థను పరిహసించడమేన్నారు.టీడీపీ ఆఫీస్‌కు భూ కేటాయింపు ప్రతిపాదనను, మున్సిపల్ ,రెవెన్యూ శాఖలు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలనీ,
ప్రభుత్వ ఉత్తర్వులు, మున్సిపల్ తీర్మానాలు,లీజు నిబంధనలను తక్షణమే ప్రజలకు బహిర్గతం చేయాలనీ, సదరు భూమిని ఎస్సీ,ఎస్టీ హాస్టళ్లు,స్టడీ సర్కిల్ లేదా తాగునీటి ప్రాజెక్టుల కోసం మాత్రమే ఉపయోగించాలనీ ఆయన డిమాండ్ చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజా ఆస్తులను దోచిపెడితే వి. సి. కె పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాలు చేస్తామని బొంతు రమణ హెచ్చరించారు.