Malikipuram: మలికిపురంలో నిరుద్యోగ సమస్యపై AIYF ఆధ్వర్యంలో ధర్నా

Malikipuram: మలికిపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట AIYF ఆధ్వర్యంలో ధర్నా. నూతన పరిశ్రమల ఏర్పాటు, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్.

Update: 2026-08-19 11:28 GMT

Malikipuram: మలికిపురంలో నిరుద్యోగ సమస్యపై AIYF ఆధ్వర్యంలో ధర్నా

మలికిపురం: నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, నిరుద్యోగ భృతి అందించాలని, జిల్లాలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) ఆధ్వర్యంలో బుధవారం మలికిపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ ఆధారిత, కొబ్బరి ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు.

రాజోలు ఎస్సీ బాలుర వసతి గృహ నిర్మాణాన్ని వెంటనే చేపట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

కార్యక్రమానికి AIYF రాజోలు నియోజకవర్గ కన్వీనర్ వై.వెంకట్, నాయకులు పి.ఆనంద్, వి. చిట్టిబాబు, డి. రమేష్, ఎడ్ల మణిరావు నాయకత్వం వహించారు. దళిత చైతన్య వేదిక నాయకులు బత్తుల మురళీకృష్ణ, మట్టా సురేష్, చిలకపాటి శ్రీధర్, శ్రీను, దళిత జేఏసీ నాయకులు తోటే ప్రతాప్, AISF నాయకులు అరుణ్, విజయ్, ఎండీ రషీద్ తదితరులు ధర్నాకు మద్దతు తెలిపారు.

Tags:    

Similar News