Amalapuram: అమలాపురంలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు!

Amalapuram: అమలాపురం నల్ల వంతెన వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్.

Update: 2026-08-20 07:36 GMT

Amalapuram: అమలాపురంలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు!

Amalapuram: ఈరోజు అమలాపురం నల్ల వంతెన వద్ద గల స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు అమలాపురం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంటెద్దు బాబి ఆధ్వర్యంలో ఘనంగా జరిగినవి.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్ విచ్చేసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి కంప్యూటర్ టెక్నాలజీని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ అని,అలాగే బీసీలకు రిజర్వేషన్ కల్పించింది.

కూడా ఆయనే యువతకు 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించారని ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి చేశారని అన్నారు.ఈ కార్యక్రమానికి పిసిసి మాజీ అధికార ప్రతినిధి ముషిణి రామకృష్ణారావు,ఎఐసిసి మెంబర్ ఏర్లగడ్డ రవీంద్ర, పిసిసి మాజీ సెక్రెటరీ దేవరపల్లి రాజేంద్ర బాబు,అమలాపురం రూరల్ మండలం అధ్యక్షులు ఏలేశ్వరం రాధాకృష్ణ,మహిళా నాయకురాలు మహబూబ్ షకిల తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News