Konaseema: 75 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఏకగ్రీవ సర్పంచ్‌గా రాజశేఖర్!
Konaseema: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం గ్రామ పంచాయతీ 75 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఏకగ్రీవ సర్పంచ్‌గా అయితాబత్తుల రాజశేఖర్ ఎన్నికయ్యారు.
Konaseema: 75 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఏకగ్రీవ సర్పంచ్‌గా రాజశేఖర్!
కోనసీమ: ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం గ్రామ పంచాయతీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇద్దరు తమ్ముళ్ల అయితా బత్తుల రాజశేఖర్(సర్పంచ్),అజయ్ సింగ్ లను అభినందించిన పెద్ద అన్నయ్య ఎమ్మెల్యే ఆనందరావు. గ్రామం ఏర్పడిన గత 75 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సర్పంచ్ స్థానం ఏకగ్రీవమయింది.ఎస్.యానాం గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన అయితాబత్తుల రాజశేఖర్ ని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ చారిత్రక విజయంపై ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు హర్షం వ్యక్తం చేస్తూ పార్టీలకంటే గ్రామాభివృద్ధే ధ్యేయంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న ఎస్.యానాం సొంత ఊరు గ్రామస్తులందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ఐక్యతకు, శాంతియుత వాతావరణానికి ఈ ఏకగ్రీవ ఎన్నిక నిదర్శనమని కొనియాడారు.
ఈ అభినందన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు,అముడా (AMUDA) చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, మరియు జనసేన పార్టీ నాయకులు మండేల బాబీ, దంగేటి చిట్టిబాబు, పలచోళ్ళ బుజ్జి, ఉలిశెట్టి దొరబాబు, పలచోళ్ళ పద్మనాభం,పెట్టా అప్పారావు తదితరులు పాల్గొని నూతన సర్పంచ్ అయితాబత్తుల రాజశేఖర్ కి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ పెద్దలు, యువకులు మరియు గ్రామస్తులందరి సమష్టి కృషితోనే ఈ ఘనత సాధ్యమైందని నాయకులు అభిప్రాయపడ్డారు.