Malikipuram: పడమటిపాలెం గ్రామంలో భారీ గోధుమ త్రాచు పాము కలకలం

Malikipuram: కోనసీమ జిల్లా మలికిపురం మండలం పడమటిపాలెం గ్రామంలో ఆరడుగుల భారీ గోధుమ త్రాచు పాము ప్రత్యక్షమైంది.

Update: 2026-06-23 11:48 GMT

Malikipuram: పడమటిపాలెం గ్రామంలో భారీ గోధుమ త్రాచు పాము కలకలం

మలికిపురం: డాక్టర్. బీఆర్ .అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం పడమటిపాలెం గ్రామంలో భారీ గోధుమ త్రాచు పాము ప్రత్యక్షమై స్థానికులను భయాందోళనలకు గురిచేసింది.

గ్రామంలోని నీటి కన్నము సమీపంలో సుమారు ఆరడుగుల పొడవు గల గోధుమ త్రాచు పాము సంచరిస్తుండటాన్ని గమనించిన గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

పాము సంచారంతో కొంతసేపు ఆ ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది. అనంతరం స్థానికులు అప్రమత్తమై పామును హతమార్చడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. ఘటనతో గ్రామంలో కొంతసేపు కలకలం రేగింది.

Tags:    

Similar News