Gokavaram: అగ్ని ప్రమాద బాధితుడికి కంబాల శ్రీనివాసరావు చేయూత
Gokavaram: గోకవరం మండలం రంపయర్రంపాలెంలో అగ్నిప్రమాదానికి గురైన చికెన్ షాప్ బాధితుడు ఉంగరాల పుల్లయ్యకు బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు ఆర్థిక సాయం అందించారు.
Gokavaram: అగ్ని ప్రమాద బాధితుడికి కంబాల శ్రీనివాసరావు చేయూత
Gokavaram: గోకవరం మండలం రంపయర్రంపాలెం గ్రామం మెయిన్ సెంటర్ లో ఉన్న ఉంగరాల పుల్లయ్యకి చెందిన చికెన్ షాప్ (తాటాకుపాక) ప్రమాదశాస్తూ గ్యాస్ లీకై సోమవారం కాలిపోయింది. ఈ విషయాన్ని గ్రామస్తుడు కంబాల యువసేన అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, స్థానిక బీజేపీ నాయకులు అమెరికాలో ఉన్న విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లారు.
తక్షణమే స్పందించిన ఆయన బాధితులకు 10 వేలు రూపాయలు ఆర్ధిక సహాయం 25 కిలలో బియ్యం పంపిణీ చేయాలనీ, రామసేన సభ్యులు, బీజేపీ నాయకులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు నాయకులు రంపయర్రంపాలెం గ్రామంలోని బాధితుడి వద్దకు మంగళవారం వెళ్లి వారిని పరామర్శించి,
ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించి, కంబాల శ్రీనివాసరావు ప్రకటించిన 10 వేలు ఆర్ధిక సహాయం 25 కీలో బియాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, బత్తుల నానాజీ, కాకర దుర్గారావు, సుభద్ర, సత్యవతి, కుమారి, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.