P Gannavaram: పి. గన్నవరంలో రెండో విడత పంచాయతీ నామినేషన్ల స్వీకరణ షురూ!
P Gannavaram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
P Gannavaram: పి. గన్నవరంలో రెండో విడత పంచాయతీ నామినేషన్ల స్వీకరణ షురూ!
పి గన్నవరం: రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేయనున్న అధికారులు. పి గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో 68 పంచాయతీ సర్పంచ్ 837 వార్డు సభ్యుల స్థానాలకు పోటీ నామినేషన్ల ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.
ఇదిలా ఉంటే పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మాచవరంలో గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు ఒకరికి ఒకరు పోటా పోటీ గా సహచర అనుచర గణంతో తమ ఎన్నికల నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.