Rajahmundry: బీజేపీ మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవికి బి ఫామ్ అందజేత!

రాజమండ్రి: ఈనెల 26న జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేస్తున్న బిజెపి మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవికి బిజెపి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర గురువారం ఉదయం బి ఫామ్ అందజేసారు. బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయ సూచన మేరకు సిగ్నేచర్ అథారిటీ ప్రకారం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొల్లిన నిర్మల కిషోర్ సంతకంతో కూడిన బిఫామ్ అందజేసారు.

అలాగే బిజెపి తరపున బరిలో నిలిచిన కార్పొరేటర్ అభ్యర్థులు కందుకూరి మనోజ్ (17వ వార్డు), బత్తిన సుధారాణి (26వ వార్డు), కురగంటి ఈశ్వరి (32వ వార్డు), క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ (35వ వార్డు), కాలెపు కుసుమ(47వ వార్డు) కూడా బి ఫామ్స్ అందుకున్నారు.

Tags: