Pedaraveedu: పెద్దారవీడులో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం కాపర్ వైర్ల దొంగతనం

Pedaraveedu: పెద్దారవీడు మండలం గొబ్బూరులో రైతు కిట్టయ్య పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి కాపర్ వైర్లు దొంగిలించారు. సాగునీరు అందక రైతు ఆందోళన

Update: 2026-06-28 10:28 GMT

Pedaraveedu: పెద్దారవీడులో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం కాపర్ వైర్ల దొంగతనం

పెద్దారవీడు: మండలంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లపై దొంగల కన్ను పడడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మండలంలోని గొబ్బూరు గ్రామ పరిధిలో రైతు చేకూరి కిట్టయ్యకు చెందిన వ్యవసాయ పొలంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి, అందులోని విలువైన కాపర్ వైర్లను దొంగిలించారు.

ప్రభుత్వానికి చలానాలు చెల్లించి ఏర్పాటు చేసుకున్న ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం కావడంతో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుతం విత్తనాలు వేసే కీలక సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పంటలకు నీరు అందించే పరిస్థితి లేక రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మండలంలో ఇలాంటి ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలు వరుసగా జరుగుతుండటంతో రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాలను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను అత్యవసరంగా పునరుద్ధరించి విద్యుత్ సరఫరా పునఃప్రారంభించాలని రైతులు విద్యుత్ శాఖ, పోలీసు అధికారులను కోరుతున్నారు.

Tags:    

Similar News