Kanigiri: కనిగిరిలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Kanigiri: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీలో అవినీతిపై ఘాటుగా స్పందించారు.
Kanigiri: కనిగిరిలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Kanigiri: మార్కాపురం జిల్లా, కనిగిరిలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఘాటు వ్యాఖ్యలు. టిడిపి పార్టీకి మొదటి ప్రాధాన్యం పార్టీ నాయకులకేనని స్పష్టం. సీఎం సహాయనిధి చెక్కుల విషయంలో అవినీతి ఆరోపణలపై తీవ్ర స్పందన. ఆఫీస్ స్టాఫ్ గానీ, నాయకులు గానీ లంచం అడిగితే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరిక.
లంచం అడిగినట్లు రుజువు చేస్తే “1000కి 100 రెట్లు ఇస్తా” అంటూ సవాల్. అమరావతి గ్రౌండ్‌లోని టిడిపి క్యాంప్ ఆఫీస్‌లో చెక్కుల పంపిణీ. ఇప్పటివరకు 350 మందికి రూ.11 కోట్లు సీఎం సహాయనిధి అందజేత. కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల ప్రజలకు లబ్ధి.
రాష్ట్ర ఖజానా పరిస్థితి కష్టంగా ఉన్నా పేదల కోసం సహాయం కొనసాగుతోందని వ్యాఖ్య. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల పట్ల సానుభూతితో ఈ పథకం అమలు చేస్తున్నారని తెలిపారు. వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని వెల్లడించారు.