Markapuram: పీజీఆర్ఎస్ అర్జీలను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్

Markapuram: మార్కాపురం కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ నిర్వహణ. 307 అర్జీలు స్వీకరించిన కలెక్టర్ విజయ సునీత. రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశం.

Update: 2026-08-03 12:26 GMT

Markapuram: పీజీఆర్ఎస్ అర్జీలను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్

మార్కాపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చే అర్జీలను సత్వరంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఒకే సమస్యపై పదేపదే అర్జీలు రాకుండా క్షేత్రస్థాయిలోనే సమస్యలను పరిష్కరించాలని, ముఖ్యంగా రెవెన్యూ సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని సూచించారు. ప్రజల సంతృప్తే అధికారుల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ పీజీఆర్ఎస్‌లో మొత్తం 307 అర్జీలు అందగా, వాటిలో 194 రెవెన్యూ, 113 ఇతర శాఖలకు సంబంధించినవిగా అధికారులు తెలిపారు.

కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు,కనిగిరి ఆర్డీవో అజయ్ కుమార్, హౌసింగ్ పీడీ మోహన్ రావు, విద్యుత్ శాఖ ఎస్ఈ ఖరీం, జిల్లా రవాణాశాఖ అధికారి రాంబాబు, జిల్లా వ్యవసాయ శాఖ ఇన్చార్జి అధికారి బాలాజీ నాయక్, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, ఇతర అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News