Podili: పదవ తరగతి ఫెయిల్ అయ్యారా? విద్యార్థులకు కలెక్టర్ సునీత కీలక సలహా!
Podili: పదవ తరగతి సప్లిమెంటరీ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను మార్కాపురం జిల్లా కలెక్టర్ సునీత పరిశీలించారు.
Podili: పదవ తరగతి ఫెయిల్ అయ్యారా? విద్యార్థులకు కలెక్టర్ సునీత కీలక సలహా!
పొదిలి: పదవతరగతి పరిక్షలలో పెయిల్ విద్యార్దులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న తరగతులను మార్కాపురం జిల్లా కలెక్టర్ సునీత పొదిలిలోని పలు పాఠశాలను పరిశీలించారు. విద్యార్దులు అందుతున్న సౌకర్యాలు, బొధన పద్దతులను విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. పరిక్షలు తప్పినంత మాత్రాన బాదపడకుడదని రాబొయే సప్లమెంటరి పరిక్షలు బాగా వ్రాశీ ఉత్తిర్ణిత సాధించాలని ఆమె సూచించారు.
జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం 1299 విద్యార్దులు ఫెయిల్ అయ్యారని వారికొసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వారికొసం తరగతులు నిర్వహిస్తుందని తెలిపారు. 10 వతరగతి పరిక్ష ఫలితాలలో నాలుగవ స్దానం సాధించినట్లు ఆమె చెప్పారు. పట్టణంలోని బాలికల,బాలుర ఉన్నత పాఠశాలలను ఆమె తనిఖి చేసారు. అనంతరం పొదిలి మండలం ఉప్పలపాడు గ్రామంలో బడిబాట ర్యాలీలో ఆమె పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు ఎం.శ్రీనివాసులు రెడ్డి, లక్ష్మి,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.