Giddalur: గిద్దలూరు చెరువులో కలప మాఫియా దందా 100 చెట్లు వేర్లతో సహా మాయం
Giddalur: గిద్దలూరు మండలం ముళ్ళపాడులోని తిమ్మరాజు ఓబులపతి చెరువులో అక్రమంగా నల్ల తుమ్మ చెట్ల నరికివేత. 100కు పైగా చెట్లు మాయం.
Giddalur: గిద్దలూరు చెరువులో కలప మాఫియా దందా 100 చెట్లు వేర్లతో సహా మాయం
గిద్దలూరు: మార్కాపురం జిల్లా, గిద్దలూరు మండలం ముళ్ళపాడు గ్రామసమిపములోని తిమ్మరాజు ఓబులపతి చెరువులో తుమ్మచెట్లను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు యంత్రాలతో ముక్కలుగా నరికి టిప్పర్ల ద్వారా లారీలద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ముచేసుకుంటున్నారు.
దాదాపు 20 సంవత్సరాలకు నుండి పెరుగుతున్న తుమ్మచెట్లు ఏపుగా దట్టంగా పెరిగి పెద్దవి కావడంతో వాటిపై దుండగుల కన్ను పడింది, జేసిబి లతో చెట్లను వేర్లతోసాహ పెకిలించి కొమ్మలను ముక్కలుగా నరికి కుప్పలుగా పోసి అనువైన సమయములో తరలించడం జరుగుతుంది.
గ్రామానికి దూరంగా ఉండడంతో ఎవరికి అనుమానం రాకుండా చెట్లను నరికి రాత్రుల్లో రవాణా చేస్తున్నారు. ఇంతజరుగుతున్న ఇరిగేషన్ అధికారులు గానీ అటవీశాఖ అధికారులు గానీ స్పందించక పోవడంతో గ్రామ ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులకు వివరణ కోరగా వారికి వచ్చిన సమాచారం మేరకు వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి దాదాపు 100 చెట్లకు పైగా నరికినట్లు గుర్తించి సంబంధిత అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.