Markapur: మార్కాపురంలో ఘనంగా తొలి స్వాతంత్ర వేడుకలు

Markapur: మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఘనంగా 80వ స్వాతంత్ర వేడుకలు. ఎస్‌వీకేపీ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరించిన కలెక్టర్ విజయ సునీత.

Update: 2026-08-15 10:49 GMT

Markapur: మార్కాపురంలో ఘనంగా తొలి స్వాతంత్ర వేడుకలు

మార్కాపూర్: మార్కాపురం జిల్లా ఏర్పడిన అనంతరం తొలిసారిగా జిల్లా కేంద్రంలోని ఎస్‌వీకేపీ కళాశాల మైదానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయ సునీత జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ పతాకానికి వందనం చేశారు.

అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల ప్రదర్శనలను కలెక్టర్ విజయ సునీత ఆసక్తిగా తిలకించారు. పోలీస్ సిబ్బంది నిర్వహించిన క్రమశిక్షణతో కూడిన పరేడ్ వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చింది.

మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకలు కావడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో ఎస్‌వీకేపీ కళాశాల మైదానం మార్మోగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, ఓఎస్డీ అడ్మిన్ నవజ్యోతి మిశ్రా, ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ రవూఫ్, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, డీఎస్పీ నాగరాజు తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:    

Similar News