Markapuram: మార్కాపురం జిల్లా తొలి స్వాతంత్య్ర వేడుకలు ఘనం!
Markapuram: మార్కాపురం జిల్లా తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఎస్వీకేపీ కళాశాల గ్రౌండ్‌లో ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్ విజయ సునీత.
Markapuram: మార్కాపురం జిల్లా తొలి స్వాతంత్ర వేడుకలు ఘనం!
Markapuram: మార్కాపురం జిల్లా ఏర్పడిన అనంతరం తొలిసారిగా జిల్లా కేంద్రంలోని ఎస్వీకేపీ కళాశాల గ్రౌండ్లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం కలెక్టర్ విజయ సునీత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా ప్రాముఖ్యతను, జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ వివరించారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడంతో పాటు మౌలిక వసతులు, విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీరు, రహదారులు తదితర రంగాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు.
మార్కాపురం జిల్లా తొలి స్వాతంత్య్ర వేడుకలు కావడంతో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా, అటవీ శాఖ ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ రవుఫ్ , డీఎస్పీ నాగరాజు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.