Giddalur: బురుజుపల్లిలో పెళ్లి వేడుకలో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు!
Giddalur: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని బురుజుపల్లిలో పెళ్లి వేడుక రణరంగంగా మారింది.
Giddalur: బురుజుపల్లిలో పెళ్లి వేడుకలో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు!
గిద్దలూరు: మార్కాపురం జిల్లా, గిద్దలూరు మండలం బురుజు పల్లి గ్రామంలో నిన్న జరిగిన వివాహ వేడుకలు హింసాత్మకంగా మారాయి. సాంబారులో ఉప్పు తక్కువైందని వధువు, వరుడు తరుపు బంధువులు గొడవపడ్డారు. తగాదా చిలికి చిలికి పెద్దది కావడంతో రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులలో ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఉండగా వీరి తలలకు బలమైన గాయాలయ్యాయి. సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.