Dichpally: పింఛన్ డబ్బులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా!
Dichpally: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి సబ్ పోస్టాఫీసు వద్ద పింఛన్ డబ్బుల కోసం లబ్ధిదారులు ధర్నా చేపట్టారు.
Dichpally: పింఛన్ డబ్బులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా!
డిచిపల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి తమకు పింఛన్ డబ్బులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లబ్దిదారులు డిచ్ పల్లి సబ్ పోస్టాఫీస్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిం చారు. ఈసందర్భంగా సీపీఐఎంఎల్ న్యూడె మొక్రసీ డివిజన్ నాయకులు వాసరి సాయినాథ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వితంతు, వృ డు ద్ధాప్య, వికలాంగ, బీడీ, చేనేత తదితర కార్మికులకు ని, రావాల్సిన పింఛను డబ్బులను ఏప్రిల్ 24న మం జూరు చేసినట్లు తెలిపారు. 15 రోజులు కావస్తున్నా పకు పోస్టాఫీసు ద్వారా పింఛనుదారులకు డబ్బులు మాత్రం ఇవ్వడం లేదన్నారు.
ఇదే విషయమై పోస్టల్ సిబ్బందిని అడిగితే ఆర్మూర్ హెడ్ పోస్టాఫీస్ నుంచి డబ్బులు రావడం లేదని సమాధానం చెబు తున్నారని తెలిపారు. అలాగే 2016 పింఛన్ బదులు 2000 రూపాయలు ఇస్తున్నారన్నారు మిగత 16 రూపాయలు ఇవ్వడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయమై వెంటనే స్పందించి డిచ్ పల్లి సబ్ పోస్టాఫీసు పరిధిలోని గ్రామాల్లో వెంటనే పింఛను డబ్బులు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో ఇమ్రాన్, బుచ్చక్క, లక్ష్మీ, భాగ్య, పోసాని, సాయిలు, భరత్, సాయమ్మ, సుజాత, పింఛను లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.