Nizamabad: కవిత కొత్త పార్టీ సభకు బోధన్ పోటెత్తిన జనం!
Nizamabad: హైదరాబాద్ మునిరాబాద్‌లో మాజీ ఎమ్మెల్సీ కవిత నూతన పార్టీ ఆవిర్భావ సభ. బోధన్ నియోజకవర్గం నుండి భారీగా తరలివెళ్లిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు.
Nizamabad: కవిత కొత్త పార్టీ సభకు బోధన్ పోటెత్తిన జనం!
నిజామాబాద్ జిల్లా: బోధన్ నియోజకవర్గంలోని భారీ స్థాయిలో తెలంగాణ జాగృతి కార్యకర్తలు శనివారం భారీ స్థాయిలో తరలి వెళ్లారు. జాగ్రత్త అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవిత నూతన పార్టీ ఆవిర్భావ సభ హైదరాబాదులోని మేడ్చల్ జిల్లా మునిరాబాద్ లో నిర్వహించనుండగా కవిత సంత నియోజక వర్గం నుండి భారీ స్థాయిలో జనాలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జాగృతి రాష్ట్ర నాయకులు రజాక్ మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదం కవితక్క ఉందని రాబోవు రోజుల్లో కచ్చితంగా రాష్ట్ర పగ్గాలు చేత్తోబట్టి ముఖ్యమంత్రి సీట్లు కూర్చుంటుందన్నారు. ఎప్పుడు ప్రజా సమస్యలపై పోరాడే మాజీ ఎమ్మెల్సీ కవితకు పేద ప్రజల అండ ఉండడంతోనే ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం రాష్ట్ర ప్రజల అదృష్టం మేరకు నూతన పార్టీని ఏర్పాటు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలను విస్మరించి నిధులు సమర్పించుకోవడంలోని నిమగ్నమైందని తమ నూతన పార్టీ ఆవిర్భావనతరం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టున్నామన్నారు.