Nizamabad: సిరికొండ అడవుల్లో ఎలుగుబంటి కలకలం: యువకుడిపై దాడి!

Nizamabad: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో ఎలుగుబంటి దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

Update: 2026-04-24 04:57 GMT

Nizamabad: సిరికొండ అడవుల్లో ఎలుగుబంటి కలకలం: యువకుడిపై దాడి!

నిజామాబాద్ జిల్లా: సిరికొండ మండలంలోని లొంక తాండకు చెందిన బాణవత్ అరవింద్ (18)పై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..తాండవాసుల తెలిపిన వివరాల ప్రకారం, గురువారం ఉదయం 8 గంటల సమయంలో అరవింద్ మేకలు మేపేందుకు లొంక సమీప అటవీ ప్రాంతంలోని ముక్క మైసమ్మ వద్దకు వెళ్లాడు. ఈ సమయంలో అకస్మాత్తుగా ఎదురైన ఎలుగుబంటి అతనిపై దాడి చేయడంతో ఎడమ భుజం భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి.స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన అరవింద్‌ను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స అందిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.అటవీ ప్రాంతాలకు వెళ్లే బీడీ ఆకులు తెంపే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.

Tags:    

Similar News