Jukkal: జుక్కల్‌లో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: ఎమ్మెల్యే తోట!

Jukkal: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు.

Update: 2026-08-28 11:11 GMT

Jukkal: జుక్కల్‌లో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: ఎమ్మెల్యే తోట!

జుక్కల్: పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. శుక్రవారం జుక్కల్ నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు చేతుల మీదుగా నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి నేరుగా చేరేలాప్రభుత్వంచర్యలుతీసుకుంటోందన్నారు.ఇందులోభాగంగానియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన ప్రాధాన్యత అని పేర్కొన్నారు.

స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందనున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ పి.మరోతి,మాజి మార్కెట్ కమిటి చైర్మన్ కె. సాయాగౌడ్, జుక్కల్ ఉప సర్పంచ్ ఫిర్దోష్,పెద్ద టాక్లి విలాస్, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు సతీష్ పాటిల్ స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు,అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News